ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rakesh Reddy: ‘అక్కా.. మా పార్టీలోకి రండి.. సీఎం చేస్తం..’

ABN, Publish Date - Aug 01 , 2024 | 03:56 AM

‘అక్కా..! మా పార్టీలోకి రండి.. సీఎం చేస్తం..’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఆహ్వానం పలికారు.

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితకు బీజేపీ నేత రాకేశ్‌రెడ్డి ఆహ్వానం

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘అక్కా..! మా పార్టీలోకి రండి.. సీఎం చేస్తం..’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఆహ్వానం పలికారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మఽధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సభ వాయిదా పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు లాబీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో కాసేపు చిట్‌చాట్‌ చేశారు. సభలో జరిగిన పరిణామాలను మీడియాతో పంచుకున్నారు.


మహిళలను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు క్షమాపణలు చెప్పే వరకూ వదలిపెట్టబోమన్నారు. వారు క్షమాపణలు చెప్పేదాకా సభను కొనసాగనీయబోమని కేటీఆర్‌ అన్నారు. అనంతరం సబిత బీఆర్‌ఎ్‌సఎల్పీ వైపు ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్లారు. అయితే ఆమె బీఆర్‌ఎ్‌సఎల్పీకాకుండా పక్కనే ఉన్న బీజేఎల్పీ ఆఫీసు తలుపుతట్టారు. అదే సమయంలో అక్కడే ఫోన్‌ మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి... సబితను చూసి అక్కా.. మా పార్టీలోకి రండి అంటూ ఆమెను ఆత్మీయంగా నవ్వుతూ ఆహ్వానించారు. అయితే ఆమె చిరునవ్వు నవ్వుతూ బీఆర్‌ఎ్‌సఎల్పీలోకి వెళ్లిపోయారు. అప్పటికీ మీడియాతో చిట్‌చాట్‌ సాగిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి మాటవిని సరదాగా నవ్వుకున్నారు.


  • మా ఆవేదన అర్థం కావట్లేదా!

సభలో సీఎం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మితో పాటు మిగతా ఎమ్మెల్యేలు స్పీకర్‌ వెల్‌, పోడియం దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో ‘మా ఆవేదన మీకు అర్థం కావడం లేదా’ అంటూ గద్గగ స్వరంతో సబిత ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ సభ్యులందరికీ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డైరెక్షన్స్‌ ఇస్తూ కనిపించారు.

Updated Date - Aug 01 , 2024 | 03:56 AM

Advertising
Advertising
<