BJP: ఎడ్ల బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:06 AM
బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం, ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మంగళ్‌హాట్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం, ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, రాకేశ్‌రెడ్డి, సూర్యనారాయణగుప్తా, రామారావు పాటిల్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎడ్లబండిపై వచ్చారు.
Updated Date - Dec 20 , 2024 | 05:06 AM