K. Lakshman: దేశ విచ్ఛిన్నానికి కుట్రలు
ABN, Publish Date - Aug 16 , 2024 | 04:26 AM
దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు.
కాంగ్రె్‌సతోపాటు విదేశీ శక్తుల యత్నం
బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
హైదరాబాద్, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు విదేశీ శక్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కొన్ని అరబ్బు దేశాలు, పశ్చిమ దేశాలు భారత్‌ను బలహీనపరచాలని చూస్తున్నాయన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆసియా ఖండంలో భారత్‌ను బలహీనపరిచేందుకు పొరుగు దేశాల్లో భారత వ్యతిరేక భావనను పెంపొందించి కొన్ని దేశాలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి.
పాకిస్తాన్, చైనా ప్రోద్బలంతో ఇస్లామిక్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోశారు.. అక్కడి హిందువులపై మారణకాండ చేస్తున్నరు.. దేవాలయాలను ధ్వంసం చేస్తున్నరు.. అని లక్ష్మణ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ రోహింగ్యాలను పెంచి పోషిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.
Updated Date - Aug 16 , 2024 | 04:26 AM