ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Republic day 2024: కేసీఆర్ అడుగుజాడల్లో సీఎం రేవంత్.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

ABN, Publish Date - Jan 26 , 2024 | 10:51 AM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై భారతీయ జనతా పార్టీ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై భారతీయ జనతా పార్టీ (BJP) విమర్శించింది. బీఆర్ఎస్ (BRS0 పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో చింతా సాంబమూర్తి, కాశం వెంకటేశ్వర్లు, బండా కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మణ్ ఏమన్నారంటే..?

‘ప్రధాని మోదీ మందు చూపుతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా దేశంలో మోదీ పాలన సాగుతుంది. కాంగ్రెస్ హయాంలో మాత్రం దళారి పాలన కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్యారెంటీ, ఉచితల పేర్లతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. పేదలకు శాశ్వత ప్రయోజనం కల్పించాలనే చిత్తశుద్ధి ఆ పార్టీకి లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను బీజేపీ చేసి చూపించింది. 33 శాతం మహిళ రిజ్వేషన్లు , అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మవిభూషణ్ అవార్డు వరించడంలో ఎవరి సిఫారసు లేదు. యాభై రోజుల రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని’ లక్ష్మణ్ సీఎం రేవంత్ పాలనను విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 10:51 AM

Advertising
Advertising