BJP MP: కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం.. బాంబ్ పేల్చిన లక్ష్మణ్
ABN, Publish Date - May 03 , 2024 | 11:59 AM
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటూ బాంబ్ పేల్చారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని కేటీఆర్ కలలు కంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు.
హైదరాబాద్, మే 3: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై (Former CM KCR) బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరడం ఖాయమంటూ బాంబ్ పేల్చారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని కేటీఆర్ కలలు కంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేద్కర్ చెప్తే.. ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చారన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే కాంగ్రెస్ అంబేద్కర్‌ను అవమానించిందని విమర్శించారు. కులాల పేరు మీద రిజర్వేషన్లు వద్దనేది రాజీవ్ గాంధీ వాదనన్నారు. రేవంత్ రెడ్డి ది (CM Revanth Reddy) కాంగ్రెస్ బ్లడ్ కాదని.. రేవంత్ కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ముస్లింలకు రిజర్వేషన్‌లను హైకోర్టు కొట్టివేస్తే.. సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు.
AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్
కేసీఆర్ గతంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్‌కు ఎలాంటి గతి పట్టిందో అదే గతి రేవంత్ రెడ్డికి పడుతుందని వ్యాఖ్యలు చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు కాదు... పాము గుడ్డు గుర్తు కాంగ్రెస్‌కు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించాలంటూ సెటైర్ విసిరారు. ప్రధాని మోదీ (PM Modi) గురించి మాట్లాడేందుకు కేటీఆర్‌కు సిగ్గు ఉండాలన్నారు. ఎన్నికల్లో గెలవమన్న భయంతోనే సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయడం లేదని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
IRCTC: 7 రోజులు, 6 రాత్రుల కేరళ టూర్ ప్యాకేజీ.. ఆఫర్ కొన్ని రోజులే
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 03 , 2024 | 11:59 AM