ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: లోక్‌సభ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు.. ఖమ్మం సీటుపై స్పష్టత వచ్చే అవకాశం

ABN, Publish Date - Mar 23 , 2024 | 08:51 PM

లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ(BJP) దృష్టి సారించింది. అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల కీలక నేతలతో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం నాడు భేటీ అయింది. ఈ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా పాల్గొనారు.

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ(BJP) దృష్టి సారించింది. అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల కీలక నేతలతో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం నాడు భేటీ అయింది. ఈ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా పాల్గొనారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను కమిటీ ఎంపిక చేయనున్నది. సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, డా. కే. లక్ష్మణ్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కు అగ్రనేతలు ఇప్పటికే చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ సీఈసీ భేటీలో తొలుత యూపీలోని మిగిలిన 25 స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల కసరత్తు మొదలయ్యేసరికి అర్థరాత్రి దాటే అవకాశం ఉంది. నేటి సీఈసీలో ఏపీ, తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఖరారు చేయనున్నది. ఖమ్మం స్థానానికి జలగం వెంకట్రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేర్లను సీఈసీ కమిటీ నేతలు పరిశీలిస్తున్నారు. ఏపీలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై కూడా కసరత్తు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 150 మంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు 291 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 09:54 PM

Advertising
Advertising