ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: కేసీఆర్ విశ్వరూప విన్యాసం ఇదే..!

ABN, Publish Date - Apr 29 , 2024 | 09:11 PM

అంతలో ఎంత తేడా.. తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ.. సామాన్యులతో మమేకమయ్యారు. తొర్రూరులో టీ సెంటర్‌ వద్ద ఆగి చాయ్ తాగి, మిరప బజ్జీలతోపాటు పకోడి సైతం తిన్నారు. అక్కడే ఉన్న స్థానికులతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అంతలో ఎంత తేడా..! బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (BRS Chief KCR) ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ.. సామాన్యులతో మమేకమయ్యారు. తొర్రూరులో టీ సెంటర్‌ వద్ద ఆగి చాయ్ తాగి, మిరప బజ్జీలతోపాటు పకోడి సైతం తిన్నారు. అక్కడే ఉన్న స్థానికులతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సదరు చిత్ర రాజంపై తెలంగాణ సమాజం తనదైన శైలిలో స్పందిస్తోంది. అధికారం అనే అందలం ఎక్కిన తర్వాత ఆయన ఎవరికి అందకుండా పోయారని.. కానీ అదే అధికారం దిగిన తర్వాత అహంకారం కూడా అటోమెటిక్‌గా దిగి పోయిందనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఇదే కేసీఆర్ 10 ఏళ్ల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత.. ఆయన చేసిన అధికార విశ్వరూప విన్యాసం అంతా ఇంతా కాదని సోదాహరణగా కొంత మంది జనాలు విశ్లేషిస్తున్నారు.


తెలంగాణ సమాజంలో ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఎంత మంది అమాయక ప్రజలు ఆయా ప్రమాదాల్లో మృత్యు ఒడిలోకి జారిపోయినా... ఆయన చూపు అటు వైపు ప్రసరించిన దాఖలాలు అయితే ఒక్కటి కూడా లేవని విమర్శకులు చెబుతున్న మాట. అంతటిదాకా ఎందుకు.. ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ఉన్న ఏకైక సీఎంగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారని నాటి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు తిట్టిపోశాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అంటూ ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కొత్తగా ఏర్పాటైన ఓ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి హోదాలో కొత్త భాష్యం చెప్పిన మహనీయడని సెటైర్లు కురిపిస్తున్నారు తెలంగాణ మేధావులు.

అంతేకాదు.. ముఖ్యమంత్రిగా క్యాంప్ కార్యాలయానికి మాత్రమే పరిమితం.. లేదా ఎర్రవెల్లిలోని తన సొంత ఫామ్ హౌస్‌కే పరిమితం.. అంతేకానీ ఏ రోజు ఆయా కోటను దాటి బయటకు రానీ ప్రజా ప్రభుత్వాధినేతగా ఆయన ఖ్యాతి గాంచారనే విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలు కోకొల్లలు.


తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అంటూ ఢిల్లీ వెళ్లి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఇదే కారు పార్టీ అధినేత కేసీఆర్ పాలనలో అదే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప మారి కుదేలై పోయిందని రాష్ట్ర ఆవేదన ప్రజానీకం వ్యక్తం చేస్తోంది. తాను చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరించారని ఈ గులాబీ బాస్ నైజాన్ని మేథావులు తిట్టిపోసిన రోజులున్నాయ్. కానీ తెలంగాణ గాలిలో ఓ మహత్తు ఉంది.. తెలంగాణ నీటిలో ఓ ఆరని నిప్పు కణం ఉంది. ఆ గాలి పీల్చి.. అ నీటిని తాగిన తెలంగాణ ప్రజలు.. అవినీతినే కాదు... అన్యాయాన్నే కాదు.. అహంకారాన్నీ సైతం సహించమని 2023 అసెంబ్లీ ఎన్నికలతో స్పష్టమైందని మాటలు వినిపిస్తున్నాయి.


ఆ క్రమంలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన ఒకే ఒక్క ఆయుధం... ఓటు అనే వజ్రాయుధంతో గుద్దితే గులాబీ బాస్‌ కేసీఆర్ ఇలా తొర్రురూ టీ సెంటర్‌లో ప్రజల మధ్యకు వచ్చి వాలిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ తెలుగువాడి పవర్.. ఇది తెలంగాణ వాడిలోని నిగూఢంగా దాగి ఉన్న వాడివేడికి ఉన్న పవర్ పుల్ పవర్ అంటూ విమర్శకులు చెబుతున్న మాట.

Updated Date - Apr 29 , 2024 | 10:18 PM

Advertising
Advertising