BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?
ABN, Publish Date - Apr 20 , 2024 | 01:09 PM
అసెంబ్లీ ఎన్నికల్లో మహానగరంలో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
- సీఎంను కలిసిన ప్రకాష్‌గౌడ్
- ఇప్పటికే కారు దిగిన దానం
- బీఆర్ఎస్ను వీడనున్న మరో ఇద్దరు శాసనసభ్యులు..?
- మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు 13 మంది కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లోకి
హైదరాబాద్ సిటీ: అసెంబ్లీ ఎన్నికల్లో మహానగరంలో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన ప్రకాష్ గౌడ్ సాయంత్రం అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మార్పు విషయంపై వారితో చర్చించారు. ‘కాంగ్రెస్‌లో చేరితే నియోజకవ ర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చెబుతున్నారు. మా వాళ్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పా. ఏం చేద్దామో సూచించండి’ అని వారిని కోరారు. మెజార్టీ అనుచరులు మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రె్‌సలోకి వెళ్లాలని అభిప్రాయపడినట్టు తెలిసింది. గతంలోనూ రేవంత్‌రెడ్డిని ప్రకాష్ గౌడ్ కలిశారు. అప్పట్లోనే ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి. అలాంటిదేం లేదని, పాత పరిచయంతో నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరేందుకు మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు.
ఇదికూడా చదవండి: ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశంపై సవాల్
ఇటీవల పలు సమావేశాల్లోనూ బీఆర్‌ఎస్ ను వీడే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం సీఎం రాజకీయ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మైనారిటీ గురుకుల విద్యాసంస్థల వైస్ చైర్మన్, రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ ఫహీమ్ ఖురేషీతో కలసి సీఎంను కలిశారు. దీంతో ఆయన బీఆర్ఎస్ను వీడడం ఖాయమని తేలిపోయింది. నేడు లేదా ఒకటి, రెండు రోజుల్లో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశముందని సన్నిహితులు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో దానం నాగేందర్ పార్టీని వీడడంతోపాటు ఏకంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పుడు చేవేళ్ల నియోజకవర్గం పరిధిలోని ప్రకాష్ గౌడ్ పార్టీ వీడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ / ఆయన తనయుడు సాయికిరణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అధిష్టానమూ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారు వెనక్కి తగ్గడంతో స్వయంగా కేసీఆర్ నచ్చచెప్పి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను బరిలో నిలిపారు. శాసనసభ ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన నగరంలో తాజా పరిణామాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇదికూడా చదవండి: అవినీతి బీఆర్‌ఎస్ నుంచి పారిపోతున్న అభ్యర్థులు
ఆపరేషన్ గ్రేటర్..
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానమూ దక్కించుకోని కాంగ్రెస్ గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నియోజక వర్గస్థాయి నేతలను హస్తం గూటికి తీసుకువచ్చేలా ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే సంఖ్యాబలం లేకున్నా గ్రేటర్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కొన్నాళ్ల క్రితం హస్తం గూటికి చేరారు. అంతకుముందే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఎండ @ 43 డిగ్రీలు
Updated Date - Apr 20 , 2024 | 01:09 PM