Kaushik Reddy: ఆ పదిమందికి సిగ్గుంటే రాజీనామా చేయాలి

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:03 AM

తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.

Kaushik Reddy: ఆ పదిమందికి సిగ్గుంటే రాజీనామా చేయాలి

  • లేదంటే చీర, గాజులు పంపిస్తా.. వేసుకొని తిరగండి

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఆ పదిమంది ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం ఉంటే.. స్పీకర్‌ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలన్నారు. లేదంటే ఆ పదిమందికి చీరలు, గాజులు కొరియర్‌ చేస్తా.. వేసుకొని తిరగండి అంటూ ఎద్దేవా చేశారు.


బిగ్‌ ఛీటర్‌ అయిన దానం నాగేందర్‌ మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారని, పొద్దున కేసీఆర్‌ దగ్గర బ్యాగులు తీసుకువెళ్లి సాయంత్రం కాంగ్రె్‌సలో చేరిన మోసగాడు కడియం శ్రీహరి అని, ఆయనకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. గత పదేళ్లలో ఒక్క ఎమ్మెల్యేకూ కేసీఆర్‌ వ్యక్తిగతంగా పార్టీ కండువా కప్పలేదని, అలా కప్పినట్లుగా చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 04:03 AM

Advertising
Advertising