ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodara Rajanarasimha: 317 జీవోతో నష్టపోయిన వారి వివరాలివ్వండి

ABN, Publish Date - Jul 27 , 2024 | 05:05 AM

జీవో 317 వల్ల అన్యాయం జరిగిన వారిని గుర్తించి, వివరాలను త్వరలోనే అందజేయాలని మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది.

  • అధికారులను ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): జీవో 317 వల్ల అన్యాయం జరిగిన వారిని గుర్తించి, వివరాలను త్వరలోనే అందజేయాలని మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది. వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో సమావే శమైంది. కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి అధికారులతో దామోదర సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.


శుక్రవారం నాటి సమావేశంలోనూ కొన్ని శాఖల నుంచి పూర్తి సమాచారం అందినా, మరి కొన్ని శాఖల నుంచి 317 జీవో బాధిత ఉద్యోగులకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉందని ఉపసంఘం అభిప్రాయ పడింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత 30-40 శాతం మంది ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు పునరావృతం అయినట్లు ఉప సంఘం గుర్తించింది.

Updated Date - Jul 27 , 2024 | 05:05 AM

Advertising
Advertising
<