ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodar Rajanarasimha: జీవో 317పై నివేదిక

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:48 AM

కొత్త జోన్లకు అనుగుణంగా ఉద్యోగాలు, ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన జీవో నంబరు 317పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది.

  • మంత్రి దామోదర ఆధ్వర్యంలో రూపొందించిన

  • మంత్రివర్గ ఉపసంఘం.. ముఖ్యమంత్రికి అందజేత

  • స్పౌజ్‌, మ్యూచువల్‌, మెడికల్‌ కేసులకు గ్రీన్‌ సిగ్నల్‌?

  • 26న జరిగే మంత్రిమండలి భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కొత్త జోన్లకు అనుగుణంగా ఉద్యోగాలు, ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన జీవో నంబరు 317పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజనర్సింహ ఆధ్వర్యంలోని ఈ కమిటీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆదివారం కలిసి నివేదికను సీల్డు కవర్‌లో అందజేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జీవో నంబరు 317లోని సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 26న మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. మంత్రి దామోదర అధ్యక్షతన మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారు, మేధావులతో చర్చలు జరిపింది.


అలాగే, ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌ విధానాల ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభ్యంతరాలు, వినతులు స్వీకరించింది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ముఖ్యంగా స్పౌజ్‌, మ్యూచువల్‌, మెడికల్‌ గ్రౌండ్‌ కేసులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారం పది రోజుల్లో ఈ తరహా కేసులను వారివారి స్థానాలకు బదిలీ చేసే అవకాశాలున్నాయి. అలాగే, కొన్ని మండలాలు జిల్లాల పరిఽధి మారడంతో తలెత్తిన లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్యపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచించినట్టు సమాచారం. వచ్చే శనివారం(26వ తేదీ) మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


  • జీవో నంబరు 317 నేపథ్యం...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పది జిల్లాలను 33 జిల్లాలుగా చేసింది. ఆయా జిల్లాల్లో పాలనా వ్యవహారాల కోసం వర్క్‌ టూ ఆర్డర్‌ కింద ఉద్యోగులను కేటాయించినా.. శాశ్వత కేటాయింపులు చేయలేదు. 2018 ఎన్నికలకు ముందు ప్రభుత్వ కొలువుల కేటాయింపులో కొత్త జోనల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని పది జిల్లాలు కలిపి జోన్‌5, జోన్‌ 6 కింద ఉండేవి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా చేశారు. దీనికి కేంద్రం 2021లో ఆమోదం తెలిపింది.


అలాగే జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లుగా మూడంచెల కేడర్లను రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ సర్కారు జీవో జారీ చేసింది. కొత్త జోన్ల వ్యవస్థ ఏర్పాటుకావడంతో వాటికి ఉద్యోగాలను, ఉద్యోగులను సర్థుబాటు చేసే ప్రక్రియలో భాగంగా 2021 డిసెంబరు 6న జీవో నంబరు 317ను విడుదల చేశారు. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు, ఆ పాత జిల్లాల పరిఽధిలోని కొత్త జిల్లాలు, జోన్లు, మల్లీ జోన్లలో తాము కావాలనుకున్న స్థానానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు.


ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్‌ మేరకు సీనియారిటీ ప్రకారం అక్కడున్న ఖాళీల ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేశారు. అయితే, ఏదైనా జిల్లాలో తగినన్ని ఖాళీలు లేకపోతే.. ఆ జిల్లాకు ఆప్షన్‌ ఇచ్చినప్పటికీ ఖాళీలు ఉన్న మరో జిల్లాకు ఉద్యోగులను బదిలీ చేశారు. దీంతో స్థానికత, స్పౌజ్‌ కోటా తదితర అంశాలు తెరపైకి రాగా జీవీ317కి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే జీవో 317 బాధితుల సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపసంఘాన్ని వేశారు.

Updated Date - Oct 21 , 2024 | 03:48 AM