ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

ABN, Publish Date - Aug 08 , 2024 | 04:33 AM

బిత్తిరి సత్తిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

హిమాయత్‌నగర్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : బిత్తిరి సత్తిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. భగవద్గీతను కించపరిచే విధంగా బిల్లు గీత పేరుతో బిత్తిరి సత్తి వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడని వానర సేన జాతీయ అధ్యక్షుడు నామ్‌ రామ్‌రెడ్డి సైబర్‌ క్రైంలో ఫిర్యాదు చేశారు.


ఆ వీడియో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని, అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థలో గీత కూడా ఒక భాగమని ఆయన లేఖలో తెలిపారు. వానర సేన ఫిర్యాదుతో బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.

Updated Date - Aug 08 , 2024 | 04:33 AM

Advertising
Advertising
<