Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
ABN, Publish Date - May 17 , 2024 | 12:03 PM
Weather Alert to AP and TS: ఎండలతో సతమతం అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు. ఒక్కసారిగా కురుస్తు్న్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది.
Weather Alert to AP and TS: ఎండలతో సతమతం అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు. ఒక్కసారిగా కురుస్తు్న్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ద్రోణి ఏర్పడటం వలన ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన..
ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత జిల్లాలతో పాటు.. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, సత్యసాయి జిల్లా్ల్లో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములుర, మెరుపులతో కూడి భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోనూ భారీ వర్షాలు...
తెలంగాణలోనూ రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని అలర్ట్ చేసింది.
For More Telangana News and Telugu News..
Updated Date - May 17 , 2024 | 12:03 PM