ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Christmas: ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు ..

ABN, Publish Date - Dec 26 , 2024 | 04:27 AM

ఏసు క్రీస్తు జన్మదినం క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఎక్కడ చూసిన క్రిస్మస్‌ సందడే కనిపించింది. మంగళవారం రాత్రి నుంచే క్రిస్మస్‌ ప్రార్థనలతో చర్చిలు మార్మోగిపోయాయి.

కల్వరిటెంపుల్‌కు 4 లక్షల మంది భక్తులు.. పలు చర్చిల్లో వైభవంగా పండుగ నిర్వహణ

  • హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆగమాగం

  • కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

మియాపూర్‌, రెజిమెంటల్‌బజార్‌, హైదరాబాద్‌, కేపీహెచ్‌బీకాలనీ/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): ఏసు క్రీస్తు జన్మదినం క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఎక్కడ చూసిన క్రిస్మస్‌ సందడే కనిపించింది. మంగళవారం రాత్రి నుంచే క్రిస్మస్‌ ప్రార్థనలతో చర్చిలు మార్మోగిపోయాయి. పండుగ నేపథ్యంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మియాపూర్‌లోని కల్వరిటెంపుల్‌కు బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4లక్షల మంది భక్తులు వచ్చారు. భక్తులకు బ్రదర్‌ డాక్టర్‌ సతీ్‌షకుమార్‌ క్రిస్మస్‌ సందేశం అందించారు. ఇక సికింద్రాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ బసలికా, సీఎ్‌సఐ వెస్లీ, మిలీనీయం మెథడిస్ట్‌, సెంటీనరీ బాప్టిస్ట్‌, గుడ్‌ న్యూస్‌ చర్చిలలోనూ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.


వాహనదారులకు నరకయాతన:

క్రిస్మస్‌ పండుగ వేళ నగరంలో ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు ఆగమాగమయ్యారు. క్రిస్మస్‌ ప్రార్థనల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు సెలవు రోజు కావడంతో నగరవాసులు ఆహ్లాదం కోసం బయటకు రావడంతో కీలక జంక్షన్‌లు, షాపింగ్‌ మాల్‌లు, సినిమాహాల్‌లు, పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడాయి. మియాపూర్‌లోని కల్వరిటెంపుల్‌ వచ్చే భక్తులు దృష్టిలో ఉంచుకుని పోలీసులు 70 మందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చందానగర్‌, మియాపూర్‌, మదీనగూడ, ఏఎంబీ మాల్‌, సైబర్‌టవర్‌, హైటెక్‌ సిటీ, అయ్యప్ప సొసైటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, సైబర్‌టవర్‌, ఐమ్యాక్స్‌, లులు మాల్‌, నెక్సస్‌ మాల్‌ వదవద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మియాపూర్‌ నుంచి గచ్చిబౌలి చౌరస్తాకు 15 నిమిషాల ప్రయాణానికి గంటకు పైగా సమయం పట్టిందంటే ట్రాఫిక్‌ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


కేసీఆర్‌ను కలిసిన క్రిస్టియన్‌ జేఏసీ నాయకులు

క్రిస్మస్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ రాజీవ్‌ సాగర్‌తో పాటు బిషప్‌ నెహేమియా, క్రిస్టియన్‌ జేఏసీ నాయకులు సోలోమన్‌ రాజు, క్యాఽథలిక్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ లియో లూయిస్‌ తదితరులు కలిశారు.

Updated Date - Dec 26 , 2024 | 04:27 AM