ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shamshabad: సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో క్లూస్‌ టీం ఆధారాల సేకరణ..

ABN, Publish Date - Jun 30 , 2024 | 05:01 AM

షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 29: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం బూర్గుల శివారులోని సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడుకు సంబంధించి క్లూస్‌ టీం పోలీసులు శనివారం ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ఆటోక్లేవ్‌ యంత్రం వద్ద గాజు శకలాలు, పౌడర్‌, గ్యాస్‌ తదితర నమూనాలను సేకరించారు.

  • మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి

  • షాద్‌నగర్‌ ఎమ్మెల్యే డిమాండ్‌

  • పరిశ్రమ మేనేజర్‌పై కేసు

షాద్‌నగర్‌, షాద్‌నగర్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి), షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 29: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం బూర్గుల శివారులోని సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడుకు సంబంధించి క్లూస్‌ టీం పోలీసులు శనివారం ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ఆటోక్లేవ్‌ యంత్రం వద్ద గాజు శకలాలు, పౌడర్‌, గ్యాస్‌ తదితర నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపి వచ్చే నివేదికను షాద్‌నగర్‌ పోలీసులకు అందజేయనున్నారు. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించగా పదిమందికి గాయాలయ్యాయి. మృతిచెందిన కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి శనివారం తరలించారు. గ్లాస్‌ పరిశ్రమను షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి సందర్శించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు.


యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యేడిమాండ్‌ చేశారు. పరిశ్రమ మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్టు క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంరెడ్డి తెలిపారు. మేనేజర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని షాద్‌నగర్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ఎంపీ డీకే అరుణ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.


బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరినట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి తెలిపారు. మరోవైపు హైకోర్టు న్యాయవాదులు కె.రాజే్‌షకుమార్‌, కె.స్వాతి, మీనాక్షి, నవీన్‌కుమార్‌ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌, సౌత్‌గ్లా్‌స ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, ఆటోమోటివ్‌ గ్లాసెస్‌ ఆర్కిటెక్చర్‌లకు లీగల్‌ నోటీసులు పంపారు. ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం, క్షతగాత్రులకు వసతుల కల్పన వివరాలు తెలపాలని కోరారు.

Updated Date - Jun 30 , 2024 | 05:01 AM

Advertising
Advertising