ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Cup: ఖమ్మంలో సీఎం కప్‌ వాలీబాల్‌ పోటీలు షురూ

ABN, Publish Date - Dec 28 , 2024 | 04:43 AM

సీఎంకప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు శుక్రవారం ఖమ్మంలోని సర్దార్‌పటేల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పోటీలకు రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి 140 మంది బాలురు, 140 మంది బాలికలు హాజరయ్యారు.

ఖమ్మం స్పోర్ట్స్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీఎంకప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు శుక్రవారం ఖమ్మంలోని సర్దార్‌పటేల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పోటీలకు రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి 140 మంది బాలురు, 140 మంది బాలికలు హాజరయ్యారు. మూడు రోజులు జరగనున్న ఈ పోటీల్లో తొలిరోజు జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీవైఎ్‌సవై సునీల్‌రెడ్డి, డీఈవో సోమశేఖరశర్మ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. వచ్చే ఒలింపిక్స్‌ పోటీల్లో తెలంగాణ నుంచి పతకాలు సాధించే సత్తా గల క్రీడాకారులను వెలికి తీయడమే ఈ క్రీడల ముఖ్యోద్దేశమని తెలిపారు. ప్రతి క్రీడాకారుడు పోటీల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.


తొలిరోజు విజేతలు...

బాలుర విభాగంలో: ఖమ్మం జట్టు మెదక్‌ జట్టుపై, మహబూబ్‌నగర్‌ జట్టు హైదరాబాద్‌ జట్టుపై, వరంగల్‌ జట్టు నల్గొండ జట్టుపై, రంగారెడ్డి జట్టు కరీంనగర్‌ జట్టుపై విజయం సాధించాయి.బాలికల విభాగంలో: నల్గొండ జట్టు రంగారెడ్డి జట్టుపై, వరంగల్‌ జట్టు మెదక్‌ జట్టుపై, నిజామాబాద్‌ జట్టు ఖమ్మం జట్టుపై, మహబూబ్‌నగర్‌ జట్టు కరీంనగర్‌ జట్టుపై విజయం సాధించాయి.

Updated Date - Dec 28 , 2024 | 04:43 AM