ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కేసీఆరే టార్చ్‌లైట్‌ వేసుకొని వెతకాలి..

ABN, Publish Date - Jul 05 , 2024 | 03:21 AM

బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదని, ఇక ఆ పార్టీది గత చరిత్రేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం రేవంత్‌ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రజలు టార్చ్‌లైట్‌ వేసుకొని వెతుక్కుంటూ బీఆర్‌ఎస్‌ కోసం వస్తారంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందించారు.

  • బీఆర్‌ఎస్‌ జాడ లేకుండా పోయింది

  • క్యాబినెట్‌ బంతి అధిష్ఠానం కోర్టులో: రేవంత్‌

న్యూఢిల్లీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదని, ఇక ఆ పార్టీది గత చరిత్రేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం రేవంత్‌ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రజలు టార్చ్‌లైట్‌ వేసుకొని వెతుక్కుంటూ బీఆర్‌ఎస్‌ కోసం వస్తారంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందించారు. నిజంగానే ఆ పార్టీ జాడ లేకుండా పోయిందని, దానికోసం టార్చ్‌లైట్‌ వేసుకొని ప్రజలే కాదు కేసీఆర్‌ కూడా వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఇంతటి దురవస్థలో లేదని, లోక్‌సభలో ఆ పార్టీకి సింగిల్‌ సీటు కూడా లేదని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష నియమాకం అంశాలు కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు.


మంత్రివర్గ విస్తరణపై తాను ఎలాంటి తేదీలు ప్రకటించలేదని చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు అనుమతించాలని, పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. ప్రస్తుతం బంతి ఏఐసీసీ కోర్టులో ఉందని, మీడియా ప్రశ్నలకు అక్కడి నుంచే సరైన సమాధానం దొరుకుతుందని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ గురించి అమిత్‌షాకు చెప్పానని, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. నీటి పంపకాలు, భద్రాద్రి రాముడి గుడి, దేవుడి మాన్యాలు కూడా ఏపీతో చర్చకు వస్తాయన్నారు. ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ మీద ఇంకా ప్రేమ తగ్గినట్లు లేదన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 03:21 AM

Advertising
Advertising