ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: బతకడానికి వచ్చినోళ్ల ఓట్లతోనే బీఆర్‌ఎ్‌సకు సీట్లు

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:36 AM

‘‘బతకడానికి వచ్చినావు.. నీవేందీ?’’ అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

  • కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ జవాబు చెప్పాలి

  • వాళ్లే అలా మాట్లాడించి ఉంటే.. కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి.. లేదంటే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి: రేవంత్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘బతకడానికి వచ్చినావు.. నీవేందీ?’’ అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘వాళ్లు చెబితే కౌశిక్‌రెడ్డి మాట్లాడాడో? వాళ్లే మాట్లాడించారో? కేసీఆరే చెప్పాలి. వాళ్లే చెప్పి కౌశిక్‌ రెడ్డితో అలా మాట్లాడిస్తే కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి. సొంతంగా మాట్లాడి ఉంటే అతణ్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చెయ్యాలి. అయినా బతకడానికి వచ్చినవాళ్లు ఓట్లేస్తేనే బీఆర్‌ఎ్‌సకు సిటీ(హైదరాబాద్‌)లో అన్నీ సీట్లు వచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు.


గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో రేవంత్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సలో చిల్లరగాళ్లు, బ్రోకర్లు చేరినందుకే కేసీఆర్‌ దగ్గరికి వెళ్లేందుకు తనకు మనసు రావడం లేదని అరికెపూడి గాంధీ అంటున్నారని తెలిపారు. ‘‘ధర్నాలు చేయొద్దు. ఎక్కడి నుంచి వచ్చారు?’’ అని గతంలో కేసీఆర్‌ ఆంధ్రవారిని ఉద్దేశించి అన్న మాటలనే ఇప్పుడుకౌశిక్‌ రెడ్డి అంటున్నారని ధ్వజమెత్తారు. గాంధీకి పీఏసీ పదవి ఇవ్వడంలో తప్పేమీ లేదని.. గతంలో కూడా ఇతరులను పీఏసీలో నియమించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్‌ఎ్‌సకు తాము ఓనర్లమయినందున ఆ స్థానంలో తామే ఉండాలని హరీశ్‌ భావిస్తున్నారని ఆరోపించారు. 2018-23 మధ్య కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉంటే.. అక్బరుద్దీన్‌ ఒవైసీని పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమించారని రేవంత్‌ ప్రశ్నించారు. 2014లో టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలున్నా బీఏసీకి ఎర్రబెల్లిని రానిచ్చారని, తనను అనుమతించలేదని.. ఎర్రబెల్లి పార్టీ మారినప్పుడు టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా తనను నియమించాలంటూ చంద్రబాబు లేఖ ఇచ్చినా నాటి సభాపతి పట్టించుకోలేదని గుర్తుచేశారు.


కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను అధ్యయనం చేయలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరింపులు చేసినందుకే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని.. అలా పడగొట్టే అవకాశం లేకపోతే తమకొచ్చే ప్రమాదం ఏమీ ఉండదని అన్నారు. ఏ పార్టీ వాళ్లు ఆ పార్టీలోనే ఉండాలని అంటే తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని, కేసీఆర్‌ లక్కీనెంబర్‌ అయిన 66మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రె్‌సకు ఉందని చమత్కరించారు. బీఏసీలో అన్ని పార్టీలకూ తాము అవకాశం ఇచ్చామని, కాంగ్రె్‌సకు తరఫున నలుగురు ఉంటే బీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురిని, సీపీఐ, బీజేపీ, ఎంఐఎం నుంచి ఒక్కొక్కరిని చేర్చుకున్నామని చెప్పారు. కౌన్సిల్‌లో తమకు మెజారిటీ లేనందువల్ల బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురిని తీసుకున్నామని, ఆ పార్టీకి తామేమీ లోటు చేయలేదన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 06:37 AM

Advertising
Advertising