ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: మేడిగడ్డ రిపేర్లపై నేడు సీఎం నిర్ణయం!

ABN, Publish Date - May 18 , 2024 | 03:20 AM

వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల వనరులసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ గతంలో నివేదిక అందించింది.

  • అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ఆమోదముద్ర వేయనున్న మంత్రివర్గం

  • మేడిగడ్డ 7వ బ్లాక్‌లో గేట్‌ ఎత్తివేత

హైదరాబాద్‌, మహదేవపూర్‌ రూరల్‌, మే 17(ఆంధ్రజ్యోతి): వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల వనరులసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ గతంలో నివేదిక అందించింది. దీనిప్రకారం ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయడానికి రూ.100 కోట్ల దాకా అవుతుందని లెక్కలు కట్టారు. అయితే, నిధులు వెచ్చించినా మున్ముందు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినదని కచ్చితంగా చెప్పలేమంటూ ఇచ్చిన నివేదికల నేపథ్యంలో తదుపరి ఏం చర్యలు చేపట్టాలనే దానిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.


కాగా, మేడిగడ్డలో కుంగిన ఏడో బ్లాకుకు చెందిన ఒక గేటును నీటిపారుదల శాఖ అధికారులు శుక్రవారం పైకి ఎత్తారు. గత ఏడాది అక్టోబరు 21న 7వ బ్లాకులోని 20వ పిల్లర్‌ కుంగగా అప్పటి నుంచిబ్లాక్‌లోని గేట్లన్నీ మూసే ఉంచారు. బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులకు 85 గేట్లున్నాయి. మిగిలిన అన్ని బ్లాకుల గేట్లను అప్పట్లోనే ఎత్తి నీటిని ఖాళీ చేశారు. ఏడో బ్లాకులోని గేట్లను ముట్టుకోలేదు. తాజాగా వానాకాలంలో మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఇచ్చింది. దీంతో ఎస్‌ఈ కరుణాకర్‌ ఆధ్వర్యంలో ఏడో బ్లాకులోని ఒక గేటును ఎత్తారు. ఇదే బ్లాక్‌లోని మిగతా గేట్లను సైతం వారం రోజుల్లో ఎత్తే అవకాశం ఉంది. బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో వరద ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇసుక మేటలు తొలగింపును ముమ్మరం చేశారు.

Updated Date - May 18 , 2024 | 03:20 AM

Advertising
Advertising