ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Debt burden: కుప్పలుగా పాత అప్పు..

ABN, Publish Date - Jul 26 , 2024 | 04:15 AM

రేవంత్‌ సర్కారుకు పాత అప్పుల కుప్ప పెద్ద సంకటంగా మారింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధుల కేటాయింపులకు కూడా రూ.6,71,757 కోట్ల మేర ఉన్న అప్పులే ప్రతిబంధకంగా మారుతున్నాయి.

  • అప్పుల కిస్తీలు, వడ్డీలకే రూ.48,331 కోట్లు

హైదరాబాద్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): రేవంత్‌ సర్కారుకు పాత అప్పుల కుప్ప పెద్ద సంకటంగా మారింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధుల కేటాయింపులకు కూడా రూ.6,71,757 కోట్ల మేర ఉన్న అప్పులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది మరో రూ.62,112 కోట్ల అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి అప్పు రూ.7,33,869 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, పాత అప్పుల అసలు కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.17,101.37 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్‌లో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. మరో రూ.17,729.77 కోట్లను అప్పుల వార్షిక వడ్డీల కింద చెల్లించాలని తెలిపింది. అంటే ఈ అప్పుల కిస్తీలు, వడ్డీల కింద ఈ ఏడాది రూ.34,831.14 కోట్లను చెల్లించాలి.


ఇది కాకుండా ప్రభుత్వ గ్యారెంటీలతో కాళేశ్వరం సాగునీటి పారుదల ప్రాజెక్టు కార్పొరేషన్‌, తెలంగాణ జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ రూ.90వేల కోట్లకు పైగా అప్పులను రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్నాయి. ఈ రూ.90 వేల కోట్లకు సంబంధించి కిస్తీలు, వడ్డీల కింద ఏటా రూ.13,500 కోట్లను చెల్లించాలి. ఇలా ప్రభుత్వ అప్పుల కిస్తీలు, వడ్డీలు రూ.34,831.14 కోట్లు, కార్పొరేషన్ల అప్పుల అసలు, వడ్డీలు రూ.13,500కోట్లు కలిపి ప్రభుత్వంపై పడే వార్షిక భారం రూ.48,331.14 కోట్లు. ఈ లెక్కన నెలకు రూ.4,027.59 కోట్లు చెల్లించాలి. ప్రస్తుత బడ్జెట్‌లో అప్పుల కిస్తీలు, వడ్డీలకే 16.59ు సొమ్ము పోనుంది.

Updated Date - Jul 26 , 2024 | 04:15 AM

Advertising
Advertising
<