CM Revanth: రేవంత్ చేతులకు గోర్లతో రక్కిన గాయాలు.. అసలేమైంది..?
ABN , Publish Date - May 08 , 2024 | 11:05 AM
ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో సీఎం రేవంత్ తన చేతులకు అయిన గాయాలను చూపిస్తూ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేతికి అయిన గాయాలను వీక్షకులకు చూపించారు.
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో(Vemuri Radha Krishna) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం బిగ్ డిబేట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో రేవంత్ తన చేతులకు అయిన గాయాలను చూపిస్తూ ఆసక్తికర విషయాన్ని చెప్పారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా చేతికి అయిన గాయాలను వీక్షకులకు చూపించారు. ప్రచారం సందర్భంగా లక్షల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తనకు షేక్ హ్యాండ్ ఇస్తారని.. ఈక్రమంలో వారి గోర్లు తనకు గుచ్చుకుని గాయాలైనట్లు వివరించారు.
ఎన్ని దెబ్బలు తగిలినా కార్యకర్తల కోసం, పార్టీ కోసం అన్ని భరిస్తూనే ప్రచారం చేస్తున్నానని సీఎం చెప్పడం అభిమానులు, కార్యకర్తలకు భావోద్వేగానికి గురి చేసింది.
ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ ఉండాలి
Read Latest Telangana News and National News
Read Latest National News and Telugu News