ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ప్రముఖ సంస్థకు సినారె పేరు!

ABN, Publish Date - Jul 30 , 2024 | 03:49 AM

తెలుగు కవిత్వానికి కొత్త నడకలు నేర్పిన సాహిత్య దిగ్గజం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలంగాణకే పరిమితమైన కవి కాదని, ఆయన తెలుగు జాతికే గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు.

  • ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తాం

  • 93వ జయంతి సభలో సీఎం రేవంత్‌

  • తమిళ రచయిత్రికి పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు కవిత్వానికి కొత్త నడకలు నేర్పిన సాహిత్య దిగ్గజం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలంగాణకే పరిమితమైన కవి కాదని, ఆయన తెలుగు జాతికే గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. కవిగా, సినీ గేయ రచయితగా, ఆచార్యునిగా, వర్సిటీ వీసీగా, రాజ్యసభ సభ్యుడిగా తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. సినారె 93వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినారె జ్ఞాపకార్థం ముఖ్య కేంద్రానికి ఆయన పేరు పెట్టడంతో పాటు వేములవాడ, సిరిసిల్ల, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామని కేసీఆర్‌ ప్రభుత్వం మాటిచ్చి, నెరవేర్చలేదని సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య సభాముఖంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.


దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ, నారాయణరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, మంత్రులతో చర్చించి, విశ్వవిద్యాలయానికి లేదా ప్రముఖ సంస్థకు సినారె పేరు పెడతామని ప్రకటించారు. ఆయన రచనలను పుస్తకాలుగా తీసుకురావడానికి సహకారం అందిస్తామని చెప్పారు. తమిళ రచయిత్రి శివశంకరికి సీఎం రేవంత్‌ చేతుల మీదగా ‘విశ్వంభర సి.నారాయణరెడ్డి జాతీయ సాహితీ అవార్డు’ను ప్రదానం చేశారు. రూ.5లక్షల పురస్కారాన్ని సినారె కుటుంబ సభ్యులు అందజేశారు. సినారె రాసిన ‘సమన్వితం’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ సినిమాలకు పాటలే కాదు, రాజకీయ ప్రసంగాలను కూడా సినారె రాశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శాంతాబయోటెక్‌ వరప్రసాద్‌ రెడ్డి, సినీనటుడు మురళీమోహన్‌, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాట్యాచార్యులు అనుపమ ఖైలాష్‌ బృందం సినారె రచించిన ‘కర్పూర వసంత రాయలు’ నృత్య రూపకాన్ని ప్రదర్శించింది.


గద్దర్‌ అవార్డుపై మరో మాట లేదు

  • నా ప్రకటనపై మీరు కనీసం స్పందించలేదు.. సినీ ప్రముఖులపై రేవంత్‌ అసంతృప్తి

సినారె జయంతి సభలో సినీ నటుడు మురళీ మోహన్‌ మాట్లాడుతూ నంది అవార్డుల ప్రదానం పదేళ్లుగా ఆగిపోయిందని, వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ... నంది అవార్డులకు బదులుగా అంతకంటే ఘనంగా డిసెంబరు 9న తెలంగాణ మేలి జాతి రత్నం గద్దర్‌ పేరుతో అవార్డులు ఇస్తామని తాను గతంలో ప్రకటించానని గుర్తు చేశారు. ఆ ప్రతిపాదనపై ఇంతవరకు సినీ ప్రముఖులెవ్వరూ తనను సంప్రదించలేదని, కనీసం స్పందించలేదని రేవంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సినీ ప్రముఖులు ముందుకు వస్తే, తాను అన్న మాటకు కట్టుబడి డిసెంబర్‌ 9న గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆ విషయంలో మరో మాట లేదని తేల్చిచెప్పారు.

Updated Date - Jul 30 , 2024 | 03:49 AM

Advertising
Advertising
<