Loksabha Polls 2024: ఉత్తరప్రదేశ్ బయలుదేరిన సీఎం రేవంత్
ABN, Publish Date - May 03 , 2024 | 10:02 AM
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక ఛాపర్‌లో సీఎం యూపీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి యూపీకి రేవంత్ పయనమయ్యారు. రాయబరేలీకి వెళ్లేముందు ఖర్గే బేగంపేట విమానాశ్రయంలో కాసేపు ఆగారు.
హైదరాబాద్, మే 3: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉత్తర్‌ప్రదేశ్ (Uttarpradesh) బయలుదేరి వెళ్లారు. శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక ఛాపర్‌లో సీఎం యూపీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో (AICC Chief Mallikarjuna Kharge) కలిసి యూపీకి రేవంత్ పయనమయ్యారు. రాయబరేలీకి వెళ్లేముందు ఖర్గే బేగంపేట విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఖర్గేకు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌తో కలిసి మల్లికార్జున ఖర్గే ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక ఛాపర్‌లో బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఖర్గే , రేవంత్ పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
Lok Sabha Polls: రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
మరోవైపు ఈరోజు (శుక్రవారం) ఉదయం రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కిషోరి లాల్ శర్మ పేరు హైకమాండ్ ప్రకటించింది. ఈరోజుతో నామినేషన్లకు చివరి రోజు కావడంతో రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi), కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి...
Kim Jong Un: ఏడాదికి 25 మంది అందమైన కన్యలతో కిమ్ జాంగ్ ఉన్‌కు ‘ప్లెజర్ స్క్వాడ్’
Shamshabad Airport: ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 03 , 2024 | 10:05 AM