ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: హరీష్.. చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్!

ABN, Publish Date - Aug 15 , 2024 | 05:37 PM

తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని.. చీము, నెత్తురు ఉంటే హరీష్‌ రాజీనామా ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ఛాలెంజ్ చేశారు. రాజీనామా చేస్తే సరే.. లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. అంతేకాదు.. ‘హరీష్‌రావు రాజీనామా చెయ్యి.. మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా. సిద్దిపేటలో హరీష్‌ను ఓడించే బాధ్యత నాది’ అని ఈ సభావేదికగా రేవంత్ మరో ఛాలెంజ్ చేశారు..

ఖమ్మం/హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు (Harish Rao) మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ (Rythu Runa Mafi) చేశామని.. చీము, నెత్తురు ఉంటే హరీష్‌ రాజీనామా ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ఛాలెంజ్ చేశారు. రాజీనామా చేస్తే సరే.. లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. అంతేకాదు.. హరీష్‌రావు రాజీనామా చెయ్యి.. మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా. సిద్దిపేటలో హరీష్‌ను ఓడించే బాధ్యత నాది. బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయ్యింది. బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం అని ఈ సభావేదికగా రేవంత్ మరో ఛాలెంజ్ చేశారు.

మూడో విడత రుణమాఫీ

తెలంగాణలో మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల అయ్యాయి. మే-06, 2022న రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా రుణమాఫీ చేసినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నామని గర్వంగా చెబుతున్నానన్నారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ కానుంది. శుక్రవారం నాడు రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కానుంది. ఇప్పటికే 2 విడతల్లో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ కాగా.. 2 విడతల్లో రూ.12 వేల కోట్లు రుణమాఫీ చేసింది రేవంత్ సర్కార్. ఖమ్మం గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని ధీమాగా చెప్పారు సీఎం. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పుకొచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌ మాట ఇచ్చారని.. రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేస్తున్నామని సభావేదికగా రేవంత్ ప్రకటించారు.


రాజీనామా చేస్తావా లేకుంటే..?

రుణమాఫీ సందర్భంగా మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్‌ను రేవంత్ గుర్తు చేశారు.రుణమాఫీ చేయలేరని హరీష్‌రావు సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్‌ సవాల్‌ చేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని హరీష్‌రావు సవాల్‌ చేశారు. రుణమాఫీ అమలు చేశాం.. హరీష్‌ రాజీనామా చెయ్‌. చీము, నెత్తురు ఉంటే హరీష్‌రావు రాజీనామా చేయాలి. హరీష్‌రావు రాజీనామా చేయకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణలు కోరాలి. తెలంగాణ రైతులను హరీష్‌రావు క్షమాపణలు కోరాలి. రూ.31 వేల కోట్లతో రుణమాఫీ కార్యక్రమం చేపట్టాం. బ్యాంకుల నుంచి రైతులకు విముక్తి కలిగించాం. రైతులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేశాం. ఎంతమంది అడ్డుపడినా రుణమాఫీ అమలు చేశాం. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ బుద్ధి మారలేదు. ప్రజలే తప్పు చేశారన్నట్లుగా కేటీఆర్‌ మాట్లాడుతున్నాడుఅని రేవంత్‌ కన్నెర్రజేశారు. బీఆర్ఎస్ నుంచి.. మరీ ముఖ్యంగా హరీష్ రావు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

Updated Date - Aug 15 , 2024 | 06:21 PM

Advertising
Advertising
<