CM Revanth Reddy: 125 సీట్లొచ్చినా..కేంద్రంలో అధికారం మాదే
ABN, Publish Date - May 17 , 2024 | 04:30 AM
లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. కాంగ్రె్‌సకు 125 సీట్లు వచ్చినా సరిపోతుందని, కూటమిలోని భాగస్వామ్యపక్షాలు మద్దతు ఇస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆ పార్టీకి 250కి పైగా సీట్లు రావాల్సి ఉంటుందన్నారు. ‘బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ) దాటలేకపోతే.. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ లేరు. కాంగ్రెస్ పరిస్థితి వేరు. మాకు మద్దతు పలికేందుకు అనేక మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయి’ అని వివరించారు.
కాంగ్రెస్‌కు మిత్రపక్షాలు మద్దతిస్తాయి
బీజేపీకి 250 దాటితేనే అవకాశం
ఓ వెబ్‌సైట్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్
ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులు లేరు
ఆర్‌ఎ్‌సఎస్ అజెండానే బీజేపీ లక్ష్యం
రిజర్వేషన్ల తొలగింపు, రాజ్యాంగం రద్దు కోసమే ‘400కు మించి’ నినాదం
నిఘావర్గాల వైఫల్యంతోనే ‘పుల్వామా’
సరిహద్దులపై ఉండాల్సిన నిఘాను ప్రతిపక్షాలపై పెట్టడంతో ఆ ఘటన
సర్జికల్ స్ట్రైక్స్‌కు ఒక్క ఆధారమూ లేదు
నేను ఏబీవీపీ పూర్వ విద్యార్థిని.. వాళ్ల సిలబస్ అంతా నాకు తెలుసు
‘ప్రింట్’ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. కాంగ్రె్‌సకు 125 సీట్లు వచ్చినా సరిపోతుందని, కూటమిలోని భాగస్వామ్యపక్షాలు మద్దతు ఇస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆ పార్టీకి 250కి పైగా సీట్లు రావాల్సి ఉంటుందన్నారు. ‘బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ) దాటలేకపోతే.. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ లేరు. కాంగ్రెస్ పరిస్థితి వేరు. మాకు మద్దతు పలికేందుకు అనేక మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయి’ అని వివరించారు. న్యూస్ వెబ్‌సైట్ ‘ప్రింట్’కు సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ 400కు మించి సీట్ల నినాదంపై స్పందిస్తూ.. రిజర్వేషన్లను తొలగించాలని, రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతోనే ఈ నినాదాన్ని ఎత్తుకుందని సీఎం ఆరోపించారు. ‘బీజేపీకి ఆర్‌ఎ్‌సఎస్ తల్లిలాంటిది. తల్లి చెప్పిన మాటలు పిల్లలు పాటిస్తారు.
ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్-370 రద్దు, సీఏఏ, ఎన్నార్సీ వంటివన్నీ ఆర్‌ఎ్‌సఎస్ లక్ష్యాలు. వాటిని బీజేపీ నెరవేర్చింది. వీటి తర్వాత రిజర్వేషన్ల తొలగింపును, రాజ్యాంగం రద్దును ఆర్‌ఎ్‌సఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని నెరవేర్చాలంటే లోక్‌సభలో మూడింట రెండు వంతుల సీట్లు అవసరం. అందుకే బీజేపీ 400కిపైగా అనే నినాదాన్ని తీసుకొచ్చింది’ అని రేవంత్ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావటం దేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. తన విద్యార్థి జీవితం ఆర్‌ఎ్‌సఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీతోనే ప్రారంభమైందని, వాళ్ల సిలబస్ ఏమిటో తనకు బాగా తెలుసని చెప్పారు. పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదన్న వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, అది జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పుల్వామా ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిఘా వర్గాల వైఫల్యంతోనే ఈ దారుణ ఘటన జరిగిందని, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండాల్సిన నిఘావర్గాల అధికారులను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అంతం చేసేందుకు మోహరించటం వల్లనే పుల్వామా ఘటన జరిగిందని విమర్శించారు.
శత్రువుల ఎంపిక నా చేతుల్లో లేదు
‘నాకు శత్రువులు ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులూ ఉన్నారు. శత్రువులు ఎవరుండాలని ఎంపిక చేసుకోవడం నా చేతుల్లో లేదు. పోరాడుతూ ముందుకెళ్లడమే నా పని’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నికార్సైన, చాలా తెలివైన వ్యక్తి అని రేవంత్ పేర్కొన్నారు. రాహుల్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా అదానీ, అంబానీల గురించి ఆయన ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అదానీని తాను ఆహ్వానించడం తప్పేమీకాదని చెబుతూ.. ‘అదానీ మా రాష్ట్రం నుంచి ఏమీ తీసుకెళ్లడం లేదు. నేనే ఆయన పెట్టుబడులు తీసుకుంటున్నా. రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావటం కోసమే అదానీని, అయన కుమారుడిని సచివాలయంలో కలిశాను. అందులో తప్పేముంది? వారు భారత పౌరులే కదా!’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధాని మోదీని బడే భాయ్ (పెద్దన్న) అనడాన్ని సమర్థించుకుంటూ.. దేశంలోని ప్రతీ ముఖ్యమంత్రి దేశ ప్రధానిని పెద్దన్నలాగే భావిస్తారని, ప్రధానమంత్రి సైతం కుటుంబ పెద్దగా రాష్ట్రాలకు సహకారం అందించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీర్‌ఎ్‌సతో, జాతీయస్థాయిలో బీజేపీతో, మోదీతో తమకు ప్రధానంగా పోటీ ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశం
రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై టీపీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమీక్షించింది. గురువారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ ఉపాఽధ్యక్షుడు వినోద్‌రెడ్డి, మాజీ మంత్రి పుష్పలీల, ఇతర సభ్యులతో పాటు ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, పార్టీ అభ్యర్థుల పని తీరు, విజయావకాశాలపై సమావేశంలో చర్చించారు.
Updated Date - May 17 , 2024 | 04:30 AM