ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ‘విభజన’లో చిక్కులు..

ABN, Publish Date - Aug 19 , 2024 | 03:43 AM

రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగపరంగా, న్యాయపరంగా అనేక చిక్కులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ చట్టాన్ని కేంద్రం పదేళ్లుగా అమలు చేయడం లేదన్నారు.

  • పునర్విభజన చట్టం అమల్లో పలు

  • రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలు

  • కేంద్రం పదేళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు

  • చట్టసభల్లో, కోర్టుల్లో గట్టిగా వాదించాల్సి ఉంది

  • అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ

  • ఆమోదించిన అధిష్ఠానానికి ధన్యవాదాలు

  • సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • తెలంగాణ నుంచి ఎంపికవడం

  • గౌరవంగా భావిస్తున్నా: అభిషేక్‌ సింఘ్వీ

  • నేడు ఉదయం అసెంబ్లీలో నామినేషన్‌ దాఖలు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగపరంగా, న్యాయపరంగా అనేక చిక్కులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ చట్టాన్ని కేంద్రం పదేళ్లుగా అమలు చేయడం లేదన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులోనూ బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే రాజ్యాంగ, న్యాయకోవిదుడైన అభిషేక్‌ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు రేవంత్‌ వెల్లడించారు.


అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం చట్టసభలు, న్యాయస్థానాల్లో సింఘ్వీ గట్టిగా వాదనలు వినిపిస్తారని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ పేరును తాము ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన్ను పరిచయం చేసేందుకు నానక్‌రామ్‌గూడలోని ఓ హోటల్‌లో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి పరిచయం చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించినందుకు అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని సీఎల్పీ ఆమోదించింది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.


ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు పెద్ద మనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్‌ కార్యకర్తలాగా వ్యవహరించారని ప్రశంసించారు. ఇక వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభ త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాజీవ్‌ గాంధీ విగ్రహావిష్కరణ ఈ నెల 20న చేపట్టాలని భావించినా.. వీలు కాలేదని తెలిపారు. రైతు కృతజ్ఞత సభ, రాజీవ్‌ విగ్రహావిష్కరణపై ఢిల్ల్లీ పెద్దలతో మాట్లాడి త్వరలోనే తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక కానుండడాన్ని తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.


భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి, మహిళా సాధికారతకు తెలంగాణ ప్రాంతం ప్రతీక అని కొనియాడారు. దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మరింత క్రియాశీలంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశానని, విద్య, వైద్యంతో పాటు అనేక సమస్యలపై పెద్దల సభలో గళం వినిపించానని తెలిపారు.


  • సీఎం రేవంత్‌ను కలిసిన సింఘ్వీ

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు హైదరాబాద్‌కు సతీసమేతంగా వచ్చిన అభిషేక్‌ మను సింఘ్వీ.. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింఘ్వీని సీఎం రేవంత్‌రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. అంతకుముందు ఆదివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న సింఘ్వీకి ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు స్వాగతం పలికారు.


అక్కడి నుంచి సింఘ్వీ నేరుగా కేకే ఇంటికి వెళ్లి, ఆయన్ను కలిశారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ సింఘ్వీ దంపతులకు కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయం నుంచి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందజేశారు. ఆ తర్వాత ప్రజాభవన్‌కు వెళ్లిన సింఘ్వీ డిప్యూటీ సీఎం భట్టితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.


కాగా, రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సోమవారం ఉదయం 11 గంటలకు అభిషేక్‌ మను సింఘ్వీ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సీఎల్పీ సమావేశంలోనే పలువురు ఎమ్మెల్యేల సంతకాల సేకరణను కూడా పూర్తి చేశారు. ఈ సీటుకు పోటీ చేసి గెలిచేంత సంఖ్యాబలం శాసనసభలో ఇతర ఏ పార్టీకీ లేదు. కాబట్టి సింఘ్వీ ఎన్నిక లాంఛనమే కానుంది.

Updated Date - Aug 19 , 2024 | 03:43 AM

Advertising
Advertising
<