ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sitarama Lift Irrigation Scheme: 15న సీతారామ రెండో పంప్‌హౌస్‌ ప్రారంభం..

ABN, Publish Date - Aug 08 , 2024 | 05:26 AM

సీతారామ ఎత్తిపోతల పథకంలో రెండో పంప్‌హౌ్‌సతో పాటు రాజీవ్‌ కెనాల్‌ను ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

  • 11న ట్రయల్‌ రన్‌.. ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకంలో రెండో పంప్‌హౌ్‌సతో పాటు రాజీవ్‌ కెనాల్‌ను ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. బుధవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 15న స్వాతంత్య్ర దినోత్సవాల అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా వైరాకు చేరుకొని, అక్కడే భోజనాలు చేసుకొని, వైరాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ఉత్తమ్‌ తెలిపారు.


అనంతరం సీతారామ ప్రాజెక్టుకు చెందిన రెండో పంప్‌హౌ్‌సతో పాటు రాజీవ్‌ కెనాల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. కాగా, 11వ తేదీన ఉదయం 10:30 గంటలకు ములకలపల్లిలో ఉన్న రెండో పంప్‌హౌస్‌ మోటార్ల ట్రయల్‌ రన్‌ను మంత్రి ఉత్తమ్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మూడో పంప్‌హౌస్‌ మోటార్ల ట్రయల్‌ రన్‌ చేపట్టనున్నారు. అనంతరం వైరాలో సీఎం బహిరంగసభా స్థలిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత మిర్యాలగూడలోని అడవిదేవులపల్లి మండలం దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ఉత్తమ్‌ పరిశీలించనున్నారు.

Updated Date - Aug 08 , 2024 | 05:26 AM

Advertising
Advertising
<