ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: కేరళలోనూ రేవంత్‌కు క్రేజ్‌!

ABN, Publish Date - May 28 , 2024 | 04:07 AM

తెలంగాణ కాంగ్రె్‌సలో అతి తక్కువ సమయంలోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా... ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. సీఎం అయిన రేవంత్‌రెడ్డి... కేరళలో పర్యటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులను కలవని కేరళలోని ముస్లిం లీగ్‌ అధ్యక్షుడు సయ్యద్‌ సాదిఖ్‌ అలీ షిహాబ్‌ తంగల్‌ ప్రత్యేకించి రేవంత్‌రెడ్డిని ఆహ్వనించడం ప్రాధాన్యం సంతరించుకొంది.

  • ముస్లిం లీగ్‌ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు స్నేహ సదస్సు, పుస్తకావిష్కరణకు

  • దుబాయ్‌లో నిర్వహించే ఓనం సధ్యకు పిలవాలని మలయాళీ కాంగ్రెస్‌ నేతల నిర్ణయం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

తెలంగాణ కాంగ్రె్‌సలో అతి తక్కువ సమయంలోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా... ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. సీఎం అయిన రేవంత్‌రెడ్డి... కేరళలో పర్యటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులను కలవని కేరళలోని ముస్లిం లీగ్‌ అధ్యక్షుడు సయ్యద్‌ సాదిఖ్‌ అలీ షిహాబ్‌ తంగల్‌ ప్రత్యేకించి రేవంత్‌రెడ్డిని ఆహ్వనించడం ప్రాధాన్యం సంతరించుకొంది. తంగల్‌ వారసుడిగా రాజకీయాల్లో ఎదిగిన సాదిఖ్‌ అలీ సర్వ మత ప్రతినిధులతో నిర్వహిస్తున్న స్నేహ సదస్సు, పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏరి కోరి రేవంత్‌రెడ్డిని మాత్రమే ఆహ్వానించగా, దానికి రేవంత్‌ సానుకూలంగా స్పందించి హాజరయ్యారు.


జాతీయ స్థాయి నాయకుల కంటే ఎక్కువగా కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేరళతోపాటు మిగిలిన రాష్ట్రాల నాయకులు ప్రాధాన్యం ఇస్తుండడం ఆసక్తికరంగా మారింది. కాగా, కులమతాలకు అతీతంగా మలయాళీలందరూ ఓనం సధ్యను ఘనంగా నిర్వహిస్తారు. సెప్టెంబరులో దుబాయిలో ఓనం పండుగను సుమారు 30 వేల మందితో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్‌రెడ్డిని ఆహ్వానించాలని దుబాయ్‌లోని మలయాళీ కాంగ్రెస్‌ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు తమతో సమావేశమైన రామగుండం ఎమ్మెల్యే మకాన్‌సింగ్‌ ఠాకూర్‌తో చర్చించడంతోపాటు కాంగ్రెస్‌ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్‌, మరో నాయకుడు రమేశ్‌ చెన్నితాలకు సమాచారం అందించారు.


కాంగ్రెస్‌ గెలుపులో ముస్లిం లీగ్‌ కీలక పాత్ర

మల్బార్‌ ప్రాంతంలో ఐదు దశాబ్దాలకుపైగా పట్టు నిలుపుకోవడం ద్వారా ముస్లిం లీగ్‌.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎ్‌ఫలో కీలక భాగస్వామిగా ఉంది. 15 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉండడమే కాకుండా, మరో 30 నియోజకవర్గాలలో తన భాగస్వామి కాంగ్రెస్‌ గెలుపులో కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికల్లోనూ డజనుకు పైగా లోక్‌సభ స్థానాల్లో కాంగ్రె్‌సను బలపరుస్తోంది. 2019లో రాహుల్‌ గాంధీ వయనాడ్‌ లోక్‌ సభ స్థానం నుంచి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ రాహుల్‌తోపాటు కేసీ వేణుగోపాల్‌ గెలుపే లక్ష్యంగా విశేష కృషి చేసింది. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న 35 లక్షల మంది మలయాళీల్లో అత్యధికులు ముస్లిం లీగ్‌ ప్రాంతాలకు చెందిన వారు కాగా, వీరికి రూ.10లక్షల బీమా పథకం విజయవంతంగా అమలవుతోంది. గల్ఫ్‌లోని తెలంగాణ వాసుల కోసం కూడా ఇదే తరహా పథకాన్ని అమలు చేయాలని దుబాయ్‌లోని ఆ పార్టీ నాయకుడు ఎస్వీ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు.

Updated Date - May 28 , 2024 | 04:07 AM

Advertising
Advertising