ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: కొడంగల్‌లో రేవంత్‌.. చింతమడకలో కేసీఆర్‌

ABN, Publish Date - May 14 , 2024 | 04:15 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • స్థానికంగా ఎక్కడికక్కడ ఓట్లు వేసిన రాజకీయ నేతలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లాలోని మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తన కూతురు త్రిషతో కలసి జోగిపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేశారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోయాక మొదటిసారి చింతమడకకు వచ్చిన కేసీఆర్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు గ్రామస్థులు పోటీపడ్డారు.


సిద్దిపేటలోని భారత్‌నగర్‌ అంబిటస్‌ పాఠశాలలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఆయన భార్య శ్రీనిత, కుమారుడు అర్చిశ్‌మాన్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లో డీజీపీ రవిగుప్తా, ఎస్‌ఆర్‌ నగర్‌లో సీఈవో వికా్‌సరాజ్‌, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఓటు వేశారు. బంజారాహిల్స్‌ రోడు నంబర్‌ 14లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న హిమాన్షును మీడియా ప్రతినిధులు పలకరించేందుకు ప్రయత్నించగా నవ్వుతూ వెళ్లిపోయారు. కొద్ది రోజుల క్రితం మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నరాజ్యసభ సభ్యుడు కేశవరావు వీల్‌ చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated Date - May 14 , 2024 | 04:15 AM

Advertising
Advertising