ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nalgonda: తాగునీటి ట్యాంకులో మృతదేహం..

ABN, Publish Date - Jun 04 , 2024 | 02:49 AM

అది నల్లగొండ జిల్లా కేంద్రంలోని 12వ వార్డు పాతబస్తీ..! 1,500 కుటుంబాలకు మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకు ద్వారా తాగునీరు అందుతోంది. కొన్నాళ్లుగా తాగునీటిలో దుర్వాసన వస్తోందంటూ కొందరు స్థానికులు మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్‌ సిబ్బంది ట్యాంక్‌ ఎక్కి తనిఖీ చేస్తే.. నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించింది.

  • నీటిలో దుర్వాసనపై స్థానికుల ఫిర్యాదు

  • ట్యాంకులో చూస్తే మృతదేహం లభ్యం

  • గత నెల 24న తప్పిపోయిన..

  • వంశీకృష్ణ మృతదేహంగా నిర్ధారణ

  • ట్యాంకు పరిధిలో 1,500 కుటుంబాలు

  • కొన్నాళ్లుగా ఆ నీటిని తాగుతున్న ప్రజలు

  • నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన

నల్లగొండ/నల్లగొండ టౌన్‌, జూన్‌ 3: అది నల్లగొండ జిల్లా కేంద్రంలోని 12వ వార్డు పాతబస్తీ..! 1,500 కుటుంబాలకు మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకు ద్వారా తాగునీరు అందుతోంది. కొన్నాళ్లుగా తాగునీటిలో దుర్వాసన వస్తోందంటూ కొందరు స్థానికులు మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్‌ సిబ్బంది ట్యాంక్‌ ఎక్కి తనిఖీ చేస్తే.. నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాతబస్తీకి సరఫరా అవుతున్న తాగునీటిలో దుర్వాసన వస్తోందని.. రోజురోజుకూ ఆ వాసన పెరుగుతుండడంతో.. పాతబస్తీలోని పలు కాలనీల వాసులు.. స్థానిక ప్రజాప్రతినిధి విషయాన్ని మునిసిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.


దాంతో.. మునిసిపల్‌ ఏఈ, వాటర్‌ లైన్‌మన్‌ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి పరిశీలించారు. అందులో కుళ్లిపోయి, పూర్తిగా ఉబ్బిపోయిన మృతదేహం కనిపించడంతో నివ్వెరపోయారు. వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. 28వ వార్డు హనుమాన్‌నగర్‌కు చెందిన ఆవుల వంశీకృష్ణ(27)కు మతిస్థిమితం లేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 24 ఇంటి నుంచి బయటకు వెళ్లిన వంశీకృష్ణ.. తిరిగి రాకపోవడంతో వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యాంక్‌లో మృతదేహమున్నట్లు పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న వంశీకృష్ణ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆ మృతదేహం వంశీకృష్ణదేనని గుర్తించారు.


హత్యా? ఆత్మహత్యా?

వంశీకృష్ణ మృతదేహంపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందగానే.. జిల్లా ఎస్పీ చందన దీప్తి సంఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో.. వంశీకృష్ణ చనిపోయి రెండుమూడ్రోజులు అవతుండొచ్చని తేలింది. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ ఎప్పుడు మృతిచెందాడు? ఎలా చనిపోయాడు? అనే వివరాలు చెప్పలేమని ఎస్పీ చందన దీప్తి తెలిపారు. కాగా.. వంశీ ఒంటిపై గాట్లు ఉండడంతో.. అది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.


మునిసిపల్‌ సిబ్బంది నిర్లక్ష్యం?

వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం ఘటన వెనక మునిసిపల్‌ సిబ్బంది బాధ్యతారాహిత్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఫిట్టర్‌తోపాటు.. ఇద్దరు ఆపరేటర్లు రోజూ ట్యాంక్‌ను పరిశీలించాలి. ట్యాంక్‌లోకి నీళ్లు వచ్చే సమయంలో.. మూతతీసి, నీటి వేగాన్ని పరిశీలించాలి. ట్యాంక్‌లో దుర్గంధం వస్తోందా? అని తనిఖీ చేయాలి. సాధారణంగా మిషన్‌ భగీరథ ట్యాంక్‌ భద్రతకు ఇద్దరు గార్డులను నియమించాల్సి ఉండగా.. ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి మాత్రమే పనిచేస్తున్నారు. ఆయన కూడా రోజూ ట్యాంక్‌ వద్దకు రారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజానికి వాటర్‌ ట్యాంక్‌ల వద్ద సీసీకెమెరాలు, ట్యాంక్‌ పైభాగంలో విద్యుత్తు లైట్లు ఉండాలి. ఇక్కడ వాటి జాడే లేదు.


నాగార్జునసాగర్‌ ఘటన మరువకముందే..

నాగార్జునసాగర్‌లో నీటి ట్యాంకులో ఏప్రిల్‌ 2న కోతుల కళేబరాలు బయటపడ్డ విషయం తెలిసిందే..! ఆ ఘటనపై ప్రభుత్వంపై విపక్ష పార్టీలు, ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఘటనతో మునిసిపల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. వాటర్‌ ట్యాంకులను తనిఖీ చేయాలని ఆదేశించారు.


కలెక్టర్‌ సీరియస్‌..

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన సీరియస్‌ అయ్యారు. సమగ్ర విచారణ జరపాలంటూ అదనపు కలెక్టర్‌ పూర్ణచందర్‌ను ఆదేశించారు. కాలనీవాసులు కొన్ని రోజులుగా అదే నీటిని తాగిన నేపథ్యంలో ఆరోగ్యపరమైన సమస్యలేమైనా ఉత్పన్నమయ్యాయా? అనే కోణంలో పరిశీలించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో వైద్య శాఖ బృందం ఇంటింటికీ తిరిగి తనిఖీలు జరిపింది. ఆ నీళ్లు తాగినవారిలో సమస్యలు కనిపించలేదని వైద్యులు గుర్తించారు. గత నెల 29న మిషన్‌ భగీరథ ట్యాంకును శుభ్రం చేయించినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ ముసాబ్‌ అహ్మద్‌ తెలిపారు.

Updated Date - Jun 04 , 2024 | 02:49 AM

Advertising
Advertising