ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: అర్బన్ పోలింగ్ పెంచడంపై తెలంగాణ సీఈవో ఫోకస్

ABN, Publish Date - Apr 04 , 2024 | 08:29 PM

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మే 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నామని వికాస్ రాజ్ వివరించారు. ఇప్పుడు అలా జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ (Vikas Raj) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మే 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నామని వికాస్ రాజ్ వివరించారు. ఇప్పుడు అలా జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు (Loksabha Polls) ప్రశాంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అర్బన్ ఏరియాలో ఓటింగ్ తక్కువగా నమోదవుతుందని ఏబీఎన్‌ మీడియాకు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో మందకోడిగా పోలింగ్ జరుగుతోందని తెలిపారు. సిటీలో ఉండే జనాలకు ఓటుపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం 18 దేశాల నుంచి ప్రత్యేక బృందాలు వస్తాయని వివరించారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 780 కోట్ల నగదును సీజ్ చేశామని వికాస్ రాజ్ తెలిపారు. 20 విభాగాల ఆధ్వర్యంలో ఆ ప్రక్రియ జరుగుతుందని ఆయన వివరించారు. గతంలో కేసులు ఉన్న నేతలపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వద్ద పరిశీలకుల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

Bandi Sanjay: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 04 , 2024 | 08:35 PM

Advertising
Advertising