ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: అధికారంలో లేకున్నా.. ప్రజల్లోనే రాహుల్‌ గాంధీ

ABN, Publish Date - Nov 06 , 2024 | 03:41 AM

‘‘దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పోరాటం సాగిస్తున్నది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేసేది

  • అధికారం కోల్పోయాక కేసీఆర్‌ ఎక్కడున్నారు?

  • బీఆర్‌ఎస్‌ నేతలకు మంత్రి శ్రీధర్‌ బాబు 10 ప్రశ్నలు

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పోరాటం సాగిస్తున్నది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేసేది, వారి తరఫున గళాన్ని వినిపించేది కాంగ్రెస్‌ మాత్రమే’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఉద్ఘాటించారు. కేంద్రంలో అధికారంలో లేకపోయినా తమ నేత రాహుల్‌గాంధీ దేశమంతా పర్యటిస్తున్నారని వివరించారు. అలాంటిది.. ఓడిపోయిన కేసీఆర్‌ ఎక్కడున్నారని బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ సర్కారు, రాహుల్‌గాంధీపై బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా మంగళవారం ఆయన పది ప్రశ్నలతో ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1,200 మంది విద్యార్థులు, యువకుల కుటుంబాలను బీఆరెస్‌ పెద్దలు ఎందుకు విస్మరించారు? 2014 జూన్‌ 14న ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానంలో కేసీఆర్‌ స్వయంగా 1,200 మంది అమరులు అని పేర్కొన్నారు.


ఆ తర్వాత అనేక సార్లు మాటమార్చి.. అమరుల సంఖ్యను వేర్వేరు ఉత్తర్వుల్లో 585కు కుదించారు. మిగతా 615 మంది ఏమైపోయారన్నదానిపై పదేళ్ల విధ్వంస పాలనలో ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల నగదు, గృహవసతి, సాగు భూమి, కుటుంబానికో ఉద్యోగం, ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తామన్న హామీలు ఏమయ్యాయి?’’ అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ-టు-పీజీ ఉచిత విద్య ఏమయ్యాయని నిలదీశారు. కాళేశ్వరంతో ఏడు జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని నమ్మబలికారని, లక్ష ఎకరాలనైనా సాగులోకి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు.

Updated Date - Nov 06 , 2024 | 03:41 AM