ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు? ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ ఇదే

ABN, Publish Date - Apr 16 , 2024 | 03:37 PM

తెలంగాణ బరిలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా ఎక్కువ స్థానాలు గెలుచేది తామంటే తామంటూ ఏ పార్టీకి ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ (India TV Opinion Poll) ఆసక్తికరమైన ఫలితాలను మంగళవారం వెలువరించింది.

Congress BRS BJP flags

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Polls 2024) సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారపర్వం ఊపందుకుంది. పార్టీలకు అతీతంగా సీట్లు ఖరారైన అభ్యర్థులంతా ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బరిలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా ఎక్కువ స్థానాలు గెలుచేది తామంటే తామంటూ ఏ పార్టీకి ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ (India TV Opinion Poll) ఆసక్తికరమైన ఫలితాలను మంగళవారం వెలువరించింది.


కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక బీజేపీ 6 స్థానాలను కైవశం చేసుకోనుందని అంచనా వేసింది.

ఇక మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషించింది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఖరారైన మాధవి లత చేతిలో ఒవైసీ ఓడిపోయే అవకాశాలు లేకపోలేదని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ విశ్లేషించింది.


కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకే దశలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఇక మొత్తం ఏడు దశల్లో జరగనున్న లోక్‌సభ పోల్స్-2024 ఏప్రిల్ 19న తొలి దశతో షురూ కానున్నాయి. మొత్తం 44 రోజుల పాటు కొనసాగనున్న ఎన్నికల ప్రక్రియలో 10.5 లక్షల పోలింగ్ బూత్‌లలో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది స్త్రీలు ఉన్నారని ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న తదుపరి దశలు వరుసగా జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!

Telangana: నల్గొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మార్పు.. కొత్తగా ఎవరంటే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 04:29 PM

Advertising
Advertising