Loan Waiver: రుణమాఫీ దక్కనివారి వివరాలు పంపండి..

ABN, Publish Date - Aug 06 , 2024 | 03:09 AM

ఆంక్షలుపెట్టి అరకొరగా రుణమాఫీ చేసి అంతా అయిపోయినట్లు రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రమింపచేస్తోందని, అన్నదాతలు బ్యాంకులచుట్టూ తిరుగుతూ పడిగాపులు గాస్తున్నారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

Loan Waiver: రుణమాఫీ దక్కనివారి వివరాలు పంపండి..

  • రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాడుతుంది: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆంక్షలుపెట్టి అరకొరగా రుణమాఫీ చేసి అంతా అయిపోయినట్లు రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రమింపచేస్తోందని, అన్నదాతలు బ్యాంకులచుట్టూ తిరుగుతూ పడిగాపులు గాస్తున్నారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.


రుణమాఫీ దక్కని వారి తరఫున బీఆర్‌ఎస్‌ పోరాటం చేయనుందని, నష్టపోయిన రైతులు తమ వివరాలను వెల్లడించాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేకసెల్‌ ఏర్పాటుచేశామని పట్టాదారు పాస్‌బుక్‌ ఉండి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ దక్కని. రైతులు తమ వివరాలను 8374852619 వాట్సప్‌ నంబర్‌కు పంపాలన్నారు. వారికి రుణమాఫీ దక్కేలా ఉద్యమిస్తామని తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 03:09 AM

Advertising
Advertising
<