ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Congress MP: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. పెరిగిన పుష్ప కలెక్షన్లు.. ఎంపీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:55 PM

అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పుష్ప 2 సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయట కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయితే.. పుష్ప 3 లెవల్‌లో మైలేజ్ వస్తుందనుకొంటున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: జమిలి ఎన్నికల సవరణ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్లిన నేపథ్యంలో బీజేపీపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి రాజ్యాంగపై నమ్మకం లేదన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. రాజ్యసభలో మాట్లాడిన తీరు సరిగ్గా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం మార్చాలి.. చెత్తబుట్టలో వేయాలంటూ గతంలో ఇదే బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Also Read: భవానీపై ఒక్క గీత పడినా ఊరుకోను


కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలపై ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రశ్నిస్తుంటే.. పార్లమెంట్‌ను వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఇష్టమైన బిల్లు కోసమే పార్లమెంట్ నడుపుతున్నారంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. బీజేపీ సారథ్యంలో ఎన్డీయే భాగస్వామ్యంలోని పార్టీల వారికి సైతం జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం లేదన్నారు.

Also Read: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు


జమిలి సవరణ బిల్లు ప్రవేశ పెట్టే వేళ.. దాదాపు 20 మంది బీజేపీ ఎంపీలు సభకు హాజరుకాలేదని గుర్తు చేశారు. అయినా జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే.. మూడు వంతుల సభ్యుల ఆమోదం కావాల్సి ఉందని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లు వ్యవహరిస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Also Read: పీటల మీద ఆగిన ఐపీఎస్ వివాహం... కార్యకర్తలు ఆందోళన


పోలీస్ అరెస్టయితే తమ రేటింగ్ పెరుగుతుందని కొందరు నేతలు భావిస్తున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు అనంతరం పుష్ప -2 సినిమా కలెక్షన్స్ ఇంకో రూ.100 నుంచి 150 కోట్లు పెరిగాయనట అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అరెస్ట్ అయితే పుష్ప 3 లెవెల్‌లో మైలేజ్ వస్తుందనుకుంటున్నారన్నారు.

Also Read: ఏపీ మళ్లీ భారీ వర్షాలు..


జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో బీజేపీ వేధింపుల కారణంగా మరికొన్ని రాష్ట్రాల్లో అరెస్ట్ కావడంతో ప్రజల్లో సానుభూతి లభించిందని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో జరిగింది అది కాదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య పోటీ నెలకొందని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆల్రెడీ జైలుకెళ్లి వచ్చిందన్నారు. కేటీఆర్ సైతం జైలుకు వెళ్లి వస్తే మైలేజ్ పెరుగుతోందని అనుకుంటున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యంగా ఆరోపించారు.

Also Read: బెల్లం పానకం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


జమిలి ఎన్నికల సవరణ బిల్లును లోక్ సభలో కేంద్రం మంగళవారం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే డిసెంబర్ 4వ తేదీ రాత్రి.. పుష్ప సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ లోని సంధ్యా దియేటర్ వద్ద వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అల్లు అర్జున్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పై విధంగా స్పందించారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 12:57 PM