Share News

R Krishnaiah: ఆర్‌ కృష్ణయ్య రాజీనామాలో ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ

ABN , Publish Date - Sep 25 , 2024 | 09:19 AM

బీసీ సంఘం నాయకుడు, వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాకు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మంగళవారం ఆమోదం తెలిపారు.

R Krishnaiah: ఆర్‌ కృష్ణయ్య రాజీనామాలో ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ

హైదరాబాద్: బీసీ సంఘం నాయకుడు, వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాకు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మంగళవారం ఆమోదం తెలిపారు. ఆర్ కృష్ణయ్యను మోదీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందంటూ బీజేపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. కృష్ణయ్య నివాసానికి వెళ్లి మరీ కలిశారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లినట్టు సమాచారం. మరి కృష్ణయ్య మనసులో ఏముంది?, మల్లు రవి ఏం చర్చించబోతున్నారు?. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే వేచిచూడాల్సిందే.


జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా కృష్ణయ్య?

ఆర్‌.కృష్ణయ్య తదుపరి అడుగు ఆసక్తికరంగా మారింది. ఆయన్ను మోదీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీసీల హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని రెండ్రోజుల కిందట జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు ఆయన్ను కోరాయి.

అయితే అంతకుముందే బీజేపీ జాతీయ అగ్ర నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓటుబ్యాంకు మరింత పెంచుకోవచ్చన్న అంచనాల్లో భాగంగా వారు ఆయనతో చర్చించినట్లు చెబుతున్నారు. కృష్ణయ్య జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్‌ షా స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆయన్ను జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమిస్తారనడానికి సంకేతాలని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - Sep 25 , 2024 | 09:19 AM