పార్టీ పంచాంగం చెప్పిన జగ్గారెడ్డి
ABN, Publish Date - Apr 09 , 2024 | 04:29 PM
కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి అడగడం కొత్తేమి కాదన్నారు. అయితే అవకాశం వచ్చిన ప్రతీ సారి తాను పీసీసీ పీఠం అడుగుతానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 09: కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి అడగడం కొత్తేమి కాదన్నారు. అయితే అవకాశం వచ్చిన ప్రతీ సారి తాను పీసీసీ పీఠం అడుగుతానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
కవితకు బెయిలిస్తే మొదటికే మోసం
పీసీసీ పీఠం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తే ఒకే.. అయితే రెడ్లలో ఎవరికైనా ఆ అవకాశం ఇస్తే మాత్రం.. ఆ పోటో పడే వారి జాబితాలో తాను సైతం ఉంటానని ఈ సందర్భంగా ఆయన కుండ బద్దలు కొట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.
అయితే ఆ కుటుంబం అధికారం కోసం అడ్డదార్లు అయితే తొక్కలేదని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని అభివర్ణించారు. ఇక బీజేపీపై ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ అని చెప్పారు.
Hyderabad: కేబుల్‌బ్రిడ్జిపై ఆగితే జరిమానా.. జన్మదిన వేడుకలు చేసుకుంటే చట్టపరమైన చర్యలు
రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. అయితే కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి ఆ విషయంపై అవగాహన లేదని ఈ సందర్భంగా జగ్గారెడ్డి వ్యంగ్యంగా అన్నారు. అలాగే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌పై జగ్గారెడ్డి ఈ సందర్భంగా పంచ్‌లు విసిరారు. ఆర్థిక వనరులు, బతుకు తెరువు కోసమే ప్రశాంత్ కిషోర్ సర్వే సంస్థను ఏర్పాటు చేసుకున్నారన్నారు.
Telangana: సీనియర్ ఐపీఎస్ అధికారి మృతి..
కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు, మాలల పార్టీ అని.. మాదిగలు, మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా అభివర్ణించారు. మీరా కుమార్, దామోదర రాజనర్సింహకు కాంగ్రెస్ పార్టీనే అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ లాభం చేకూరేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారన్నారు.
BJP: రాష్ట్రంలో ఆర్‌బీ ట్యాక్స్ నడుస్తోంది: మహేశ్వరరెడ్డి
తాను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా చెబుతున్నా.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆ పార్టీకి రాహుల్ గాంధీనే రాజు అని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినా.. గెలిచానా.. రాహుల్ గాందీ మాత్రం రాజేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ వార్తలు కోసం..
Updated Date - Apr 09 , 2024 | 04:33 PM