Uppal: కాంగ్రెస్ ఖాతాలోకి బోడుప్పల్ కార్పొరేషన్
ABN, Publish Date - Jul 16 , 2024 | 05:15 AM
మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. మేయర్‌గా మేడ్చల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ కుమారుడు తోటకూర అజయ్ యాదవ్ ఎన్నికయ్యారు.
మేయర్‌గా తోటకూర అజయయాదవ్ ఎన్నిక
డిప్యూటీ మేయర్‌గా కొత్త స్రవంతి కిశోర్ గౌడ్
ఉప్పల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. మేయర్‌గా మేడ్చల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ కుమారుడు తోటకూర అజయ్ యాదవ్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కొత్త స్రవంతి కిశోర్ గౌడ్ నియమితులయ్యారు. సోమవారం కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి మొత్తం 28 మంది కార్పొరేటర్లకు గాను 26 మంది హాజరయ్యారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్‌లు హాజరు కాలేదు. హాజరైన కార్పొరేటర్లలో మేయర్ పదవికి కేవలం అజయ్ యాదవ్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
డిప్యూటీ మేయర్‌కు ఇద్దరు పోటీపడగా... చివరకు 4వ డివిజన్ కార్పొరేటర్ కొత్త స్రవంతి కిశోర్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. అనంతరం జరిగిన అభినందన సభలో మైనంపల్లి హన్మంతరావు, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వజ్రే్‌షయాదవ్‌లు నూతనంగా ఎన్నికైన మేయర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలను బయట పెడతామని అజయ్ యాదవ్ హెచ్చరించారు. కాగా, ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పీఠం కాంగ్రెస్ కైవసమైంది.
Updated Date - Jul 16 , 2024 | 05:15 AM