పోలీస్ శిక్షణకు కానిస్టేబుళ్లు సిద్ధం
ABN , Publish Date - Feb 19 , 2024 | 11:40 PM
ఇటీవల నియామకపత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లు పోలీస్‌శిక్షణకు సిద్ధమ వుతున్నారు.

- ఎంపికైన 179 మందిలో రిపోర్ట్‌చేసింది 163 మంది
- వారికి కిట్స్ అందజేసిన ఎస్పీ హర్షవర్దన్
మహబూబ్‌నగర్, ఫి బ్రవరి 19 : ఇటీవల నియామకపత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లు పోలీస్‌శిక్షణకు సిద్ధమ వుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా నుంచి ఎంపికైన 179 మంది కానిస్టేబుళ్లలో 163 మం ది రిపోర్ట్ చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ వారికి కిట్ ఆర్టికల్‌ని అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్‌శిక్షణ నియమ నిబంధనలు వారికి ఎస్పీ తెలియజేశారు. వివిధ పోలీస్‌శిక్షణ సంస్థలలో ఈనెల 21నుంచి 9 నెలలపాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలాన్ని క్రమశిక్షణతో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ సురేశ్‌కుమార్ డీఎస్పీ ఏఆర్ శ్రీనివాస్, ఏఓ రుక్మిణిబాయి తదితరులు పాల్గొన్నారు.