ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసెంబ్లీ ప్రాంగణంలోకి మండలి భవనం

ABN, Publish Date - Oct 23 , 2024 | 04:42 AM

అసఫ్‌ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తాం

మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు వెల్లడి

భవన నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అసఫ్‌ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ హెరిటేజ్‌ భవనం అందుబాటులోకి వస్తే శాసనమండలిని అసెంబ్లీ ప్రాంగణంలోకి మార్చవచ్చునన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ఉన్నట్టుగానే అసెంబ్లీ భవన ప్రాంగణంలో సెంట్రల్‌ హాల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. పార్లమెంట్‌ తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు అసెంబ్లీ మరింత చేరువవుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని హెరిటేజ్‌ భవనమైన పాత అసెంబ్లీ భవన పునర్నిర్మాణం పురోగతిపై మంగళవారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి స్పీకర్‌ చాంబర్‌లో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

భవనాన్ని పునర్నిర్మిస్తున్న ఆగాఖాన్‌ ప్రతినిధులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులుతో సమావేశం నిర్వహించారు. రెండు, మూడు నెలల్లో భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, చారిత్రక వైభవానికి ఇబ్బంది కలగకుండా భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఆగాఖాన్‌ ప్రతినిధులకు మంత్రులు సూచించారు. భవనానికి కావాల్సిన ఎలక్ర్టిఫికేషన్‌ వ్యవస్థ, ప్లంబింగ్‌ పనులపై టెండర్లు పిలవాలని ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ సెక్రటరీ హరిచందనను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఆగాఖాన్‌ ట్రస్ట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.2 కోట్ల నిధులను సమావేశం నుంచే ఉపముఖ్యమంత్రితో మాట్లాడి.. అప్పటికప్పుడే విడుదల చేయించారు. కాగా, పనులు వేగంగా సాగేందుకు ప్రత్యేకంగా ఒక ఎస్‌ఈ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షించాలని ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ సెక్రటరీని మంత్రి శ్రీఽధర్‌బాబు ఆదేశించారు.

Updated Date - Oct 23 , 2024 | 04:42 AM