Sangareddy: బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలు
ABN, Publish Date - Jul 16 , 2024 | 03:12 AM
అయిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు న్యాయాధికారి కె. జయంతి సోమవారం తీర్పు వెల్లడించారు.
సంగారెడ్డి క్రైం, జూలై 15: అయిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు న్యాయాధికారి కె. జయంతి సోమవారం తీర్పు వెల్లడించారు. పటాన్‌చెరులోని ఆల్విన్‌కాలనీకి చెందిన ఇటిక్యాల నవీన్(30) పక్క ఇంట్లో ఉన్న ఓ ఐ దేళ్ల బాలికపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడు నవీన్‌పై నేరం రుజువు కావడంతో కోర్టు శిక్షను విధించింది.
Updated Date - Jul 16 , 2024 | 03:12 AM