CV Anand: ఏ టెక్నాలజీ వాడినా ఇట్టే పట్టేస్తాం.. మా నుంచి తప్పించుకోలేరు
ABN, Publish Date - Oct 26 , 2024 | 08:12 AM
వాట్సాప్, స్నాప్‌చాట్, వీవోఐపీ.. ఏ టెక్నాలజీ వాడినా, కొత్త ఎత్తులు ఎన్ని వేసినా సిటీ పోలీస్, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసుల నుంచి డ్రగ్ స్మగ్లర్లు, వినియోగదారులు తప్పించుకోలేరని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) హెచ్చరించారు. తమ వద్ద అత్యాధునిక టూల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
- సిటీపోలీస్ వద్ద అత్యాఽధునిక టూల్స్ ఉన్నాయి
- డ్రగ్స్ వినియోగదారుల్లో సంపన్నుల పిల్లలు
- అవసరాన్ని బట్టి వివరాలు బయటపెడతాం: సీపీ
హైదరాబాద్ సిటీ: వాట్సాప్, స్నాప్‌చాట్, వీవోఐపీ.. ఏ టెక్నాలజీ వాడినా, కొత్త ఎత్తులు ఎన్ని వేసినా సిటీ పోలీస్, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసుల నుంచి డ్రగ్ స్మగ్లర్లు, వినియోగదారులు తప్పించుకోలేరని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) హెచ్చరించారు. తమ వద్ద అత్యాధునిక టూల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. హెచ్‌న్యూ పోలీసులకు శుక్రవారం చిక్కిన నైజీరియన్, లోకల్ స్మగ్లర్స్ నెట్‌వర్క్‌లో నగరంలోని పలువురు సంపన్నవర్గాలకు చెందిన పిల్లలు ఉన్నట్లు తేలిందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Begumpet Airport: ‘బేగంపేట’లో అపోలో విమానానికి ‘డ్యామేజీ’
ప్రస్తుతం వారి వివరాలను బయటపెట్టడం లేదని, వారిలో మార్పు రాకపోతే.. కచ్చితంగా కేసులు నమోదు చేసి, అవసరాన్ని బట్టి వివరాలు ఇస్తామని తెలిపారు. తమ పిల్లలను మార్చుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారని అన్నారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలుగా మారడం కలిచివేస్తోందని, ఇకపై స్మగ్లర్స్‌ను, వినియోగదారులను క్షమించే ప్రసక్తే లేదన్నారు.
ఎంతో కష్టపడి చాకచక్యంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, రెండు డ్రగ్స్ ముఠాలను పట్టుకొని, అంతర్జాతీయ నైజీరియన్ స్మగ్లర్, అంతర్రాష్ట్ర కేరళ స్మగ్లర్ సహా.. ఇద్దరు లోకల్ స్మగ్లర్స్ ఆటకట్టించిన హెచ్‌న్యూ ఇన్‌స్పెక్టర్ డానియెల్, శ్రీనివాస్, ఎస్‌ఐ వెంకటరాములు, హెస్‌హెచ్‌వో బాలకృష్ణ, మహిళా కానిస్టేబుళ్లు మీనా, లక్ష్మీ బృందంతో పాటు.. కంచన్‌బాగ్, హుమాయూన్‌నగర్ పోలీసులను, ఆపరేషన్ పర్యవేక్షించిన డీసీపీ సుదీంద్రను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. పోలీసులతో కలిసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్
ఇదికూడా చదవండి: Winter Weather: వణికిస్తున్న చలి పులి..!
ఇదికూడా చదవండి: jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి
ఇదికూడా చదవండి: Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 26 , 2024 | 08:12 AM