ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Year: శుభాకాంక్షల పేరుతో కొత్త మోసం

ABN, Publish Date - Dec 28 , 2024 | 04:46 AM

కాదేది మోసానికి అనర్హం అంటూ వేడుకలను సైతం సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆప్తులు, స్నేహితులకు పంపించే శుభాకాంక్షలు, దుకాణాలు ప్రకటించే ఆఫర్లను మోసాలకు మార్గాలుగా మార్చుకుంటున్నారు.

  • న్యూ ఇయర్‌ విషెస్‌, డిస్కౌంట్ల పేరిట లింకులు

  • అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ నిపుణులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాదేది మోసానికి అనర్హం అంటూ వేడుకలను సైతం సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆప్తులు, స్నేహితులకు పంపించే శుభాకాంక్షలు, దుకాణాలు ప్రకటించే ఆఫర్లను మోసాలకు మార్గాలుగా మార్చుకుంటున్నారు. న్యూ ఇయర్‌ విషెస్‌, డిస్కౌంట్‌ కూపన్లు, భారీ ఆఫర్లు, ఈవెంట్ల పాస్‌ల పేరుతో బోగస్‌ లింకులను పంపి మోసానికి పాల్పడుతున్నారు. ఒకవేళ వాటిని తెరిస్తే ఫోన్‌ హ్యాక్‌ అవుతుంది. బ్యాంకు అకౌంటు ఖాళీ అవుతుంది. ఆ లింక్‌లను ఇతరులకు ఫార్వార్డ్‌ చేస్తే అందుకున్న వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.


ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా వివిధ సంస్థల పేరుతో ఈవెంట్‌ పాసులు కూడా పంపుతున్నారు. వివరాలు నమోదు చేసుకుంటే తక్కువ ధరకే టికెట్లు వస్తాయని ఊరిస్తున్నారు. లింక్‌లు తెరిచిన వెంటనే ఇందులో ఉండే మాల్‌వేర్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ను తమ నియంత్రణలో తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలోని డబ్బు కాజేయడంతోపాటు బ్లాక్‌ మెయిలింగ్‌లకు సైతం పాల్పడే ప్రమాదం ఉందని పోలీసులు, సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తెలియని, కొత్త నెంబరు నుంచి వచ్చే లింకులను తెరవకూడదని సైబర్‌ నిపుణుడు ప్రసాద్‌ పాటిబండ్ల సూచించారు.

Updated Date - Dec 28 , 2024 | 04:46 AM