ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mulugu: ఏటూరునాగారంలోనూ వేలాది వృక్షాల ధ్వంసం

ABN, Publish Date - Sep 09 , 2024 | 04:52 AM

మేడారం అభయారణ్యంలో సుడిగాలుల ప్రభావానికి 205 హెక్టార్లలో వృక్ష సంపద ధ్వంసమైన ఘటనను మరువక ముందే ఏటూరునాగారం మండలంలోనూ అదే తీరులో భారీగా వృక్షాలు నేలకూలాయి.

  • సుడి గాలుల ప్రభావం వల్లేనని అటవీ శాఖ అంచనా

ములుగు, సెప్టెంబరు 8: మేడారం అభయారణ్యంలో సుడిగాలుల ప్రభావానికి 205 హెక్టార్లలో వృక్ష సంపద ధ్వంసమైన ఘటనను మరువక ముందే ఏటూరునాగారం మండలంలోనూ అదే తీరులో భారీగా వృక్షాలు నేలకూలాయి. దొడ్ల-కొత్తూరు వైల్డ్‌లైఫ్‌ అటవీ ప్రాంతంలో సుడి గాలుల దాటికి వేలాది వృక్షాలు విరిగిపడ్డట్లు ఫారెస్టు అధికారులు తాజాగా ఆదివారం గుర్తించారు. అయితే, గత నెల 31 రాత్రి బలమైన గాలులు బీభత్సం సృష్టించాయి. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో వేలాది చెట్లు విరిగి పడి కనిపించాయి.


దీనిపై అటవీఅధికారులు విచారణ చేపట్టారు. ఒకవైపు ఇది కొనసాగుతుండగానే.. దొడ్ల-కొత్తూరు ప్రాంతంలో అదే తరహాలో వృక్షాలు నేలకూలి కనిపించాయి. మేడారం ప్రాంతంలో చెట్లు వలయాకార విస్తీర్ణంలో కూలగా.. దొడ్ల, కొత్తూరు ప్రాంతంలో సరళరేఖ గీసినట్టు వరుసగా చెట్లన్నీ నేలకూలినట్లు గుర్తించారు. చెట్లు కూలిన తీరును బట్టి దొడ్ల-కొత్తూరు ప్రాంతంలో పుట్టిన సుడిగాలి మేడారం సమీపంలో ఉగ్రరూపం దాల్చి కొండపర్తి-జలగలంచ వద్ద అంతర్థానమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 04:52 AM

Advertising
Advertising