ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Police Brutality: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడి

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:35 AM

బంగారం, నగదు అపహరించిందనే నెపంతో పోలీసులు ఓ దళిత మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోవడంతో.. ఫిర్యాదుదారు కారులో ఇంటికి పంపించారు.

  • దొంగతనం చేసిందనే నెపంతో కొట్టిన ఇన్‌స్పెక్టర్‌

  • ఘటనపై విచారణకు సీఎం రేవంత్‌ ఆదేశం

  • ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు ఇన్‌స్పెక్టర్‌ అటాచ్‌

షాద్‌నగర్‌ రూరల్‌/హైదరాబాద్‌/సిటీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): బంగారం, నగదు అపహరించిందనే నెపంతో పోలీసులు ఓ దళిత మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోవడంతో.. ఫిర్యాదుదారు కారులో ఇంటికి పంపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్‌లోని అంబేడ్కర్‌ కాలనీలో ఉంటున్న నాగేందర్‌.. తన ఇంట్లో 26 తులాల బంగారం, రూ. 2లక్షల నగదు చోరీకి గురైందని జూలై 24న షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి సమీపంలో ఉండే సునీత, భీమయ్య దంపతులపై అనుమానం ఉందని చెప్పాడు.


దీంతో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామిరెడ్డి అదే రోజున సునీత, భీమయ్య దంపతులతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం భీమయ్యను పంపించారు. ఆ తర్వాత నేరం ఒప్పుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ తనను విచక్షణా రహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. మగ పోలీసులు తనపై ఎక్కడపడితే దాడి చేశారని, తన కుమారుడిని లాఠీతో కొట్టారని తెలిపింది. తాను స్పృహ కోల్పోవడంతో నాగేందర్‌ కారులో తనను ఇంటికి పంపించారని వెల్లడించింది. అయితే, దొంగతనం కేసులో సునీతపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి 13 రోజులు గడుస్తున్నా.. ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆమెను కొట్టారని.. అరెస్టుకు ముందు ఆస్పత్రికి తీసుకువెళితే గాయాలు కనిపిస్తాయనే అరెస్టు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి.


  • బాధ్యులపై చర్యలకు రేవంత్‌ ఆదేశం..

షాద్‌నగర్‌ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. విషయం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన దృష్టికి వెళ్లడంతో.. ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు వారికి అండగా ఉంటామని రేవంత్‌ భరోసా ఇచ్చారు. రేవంత్‌ ఆదేశాలతో సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మొహంతి విచారణకు ఆదేశించారు. షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి విచారణలో దళిత మహిళ పట్ల డీఐ అమానుషంగా ప్రవర్తించినట్లు తేలింది. దాంతో ఇన్‌స్పెక్టర్‌ రామిరెడ్డిని సిటీ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.


  • డీఐపై అట్రాసిటీ కేసు పెట్టాలి..

షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీతను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతమ్‌.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మెంబర్‌ వెంకటయ్య ఆదివారం పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మహిళను విచక్షణా రహితంగా కొట్టిన ఇన్‌స్పెక్టర్‌ రామిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 05 , 2024 | 04:35 AM

Advertising
Advertising
<