ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం

ABN, Publish Date - Jun 11 , 2024 | 04:42 AM

నకిలీ మందుల తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయడానికి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇటీవలే కొత్తగా ఉద్యోగాలు సాధించిన 17 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు సోమవారం మంత్రి నియామక పత్రాలను అందజేశారు.

  • వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర

  • డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాల అందజేత

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): నకిలీ మందుల తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయడానికి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇటీవలే కొత్తగా ఉద్యోగాలు సాధించిన 17 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు సోమవారం మంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకాన్ని చేపట్టామన్నారు.


నూతనంగా ఎంపికైన ఔషధ నియంత్రణ అధికారులు శాఖ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఇన్‌చార్జి) ఆర్వీ కర్ణన్‌, జాయింట్‌ డైరెక్టర్‌ రామ్‌దాన్‌లు పాల్గొన్నారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 04:42 AM

Advertising
Advertising