ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Danam Nagender: మంగళసూత్రం విలువ మోదీకేం తెలుసు..?

ABN, Publish Date - May 04 , 2024 | 11:32 AM

ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రం విలువ ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) ఎద్దేవా వేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు అమ్ముకోవాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

- సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌

హైదరాబాద్: ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రం విలువ ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) ఎద్దేవా వేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు అమ్ముకోవాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శనివారం బంజారాహిల్స్‌(Banjara Hills)లోని లేక్‌ వ్యూ బంజారాలో నిర్వహించిన ఖైరతాబాద్‌ డివిజన్‌ కార్యకర్తల సమ్మేళనా నికి దానం నాగేందర్‌తో పాటు కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి(Corporator P. Vijaya Reddy) ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. అబ్‌కి బార్‌ 400 అని ప్రధాని మోదీ పిలుపునిస్తున్నారని, ఇలా సీట్లు వస్తే చైనా, రష్యా ప్రధానుల మాదిరి రాబోయే 20సంవత్సరాలు తానే ప్రధాన మంత్రిగా ఉండాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. కానీ ప్రజలు ఈ విష యం పసిగట్టి బీజేపీ(BJP)కి కాకుండా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మొదలైన హోం ఓటింగ్‌.. మొదటి రోజు నగరంలో ఇంటి వద్దే ఓటేసిన 177 మంది

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించేందుకు రిజర్వేషన్‌లు ఏర్పాటు చేస్తే వాటిని ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు ఏం చేయలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పేందుకే సీఎం రేవంత్‌రెడ్డి తన లాంటి ప్రజా నాయకుడికి టికెట్‌ ఇచ్చారని దానం పేర్కొన్నారు. అన్ని వర్గాల సమస్యలు తెలిసిన తనకు ఓటు వేసి గెలిస్తే అభివృద్ధికి పునాదులు వేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి మాట్లాడుతూ ఖైరతాబాద్‌(Khairatabad) అంటే కాంగ్రెస్‌ కంచుకోట అని రాబోయే ఎన్నికల్లో అందరూ ఐక్యమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు నారికెళ్ల నరేష్‌, దన్‌రాజ్‌రాథోడ్‌, వంశీ పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: MVS Reddy: ‘కోడ్‌’ ముగిశాక మెట్రో రెండో దశ డీపీఆర్‌..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 04 , 2024 | 11:32 AM

Advertising
Advertising