TG Politics: పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ కేడర్‌కు దీపాదాస్ మున్షి కీలక సూచనలు
ABN, Publish Date - Mar 29 , 2024 | 06:34 PM
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) కేడర్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి(Deepa Dasmunshi) కీలక సూచనలు చేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రచార కార్యక్రమాలు పోలింగ్ బూత్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని తెలిపారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) కేడర్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి (Deepa Dasmunshi) కీలక సూచనలు చేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రచార కార్యక్రమాలు పోలింగ్ బూత్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి రోజూ ప్రచార అంశాలపై సోషల్ మీడియాలో చర్చించేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగుడాలో జరగబోయే భారీ బహిరంగ సభలో ఏఐసీసీ మ్యానిఫెస్టో ప్రకటిస్తుందని అన్నారు. ఏఐసీసీ ‘పాంచ్ న్యాయ్’ పేరుతో ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
Komatireddy Venkatareddy: త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్.. కోమటిరెడ్డి సంచలనం
‘పాంచ్ న్యాయ్’ అంశాలను తెలుగులో అనువదించి కింది స్థాయి కార్యకర్తల వరకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఏఐసీసీ ఇచ్చే ప్రతి ప్రచార కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలోకి వెళ్లేలా ప్రచారం చేయాలని చెప్పారు. స్థానికంగా ఉండే సమస్యలను అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నందున ప్రతి రోజూ క్రియాశీలకంగా పని చేయాలని కోరారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో చేసిన ప్రజా పాలన పనులను, మోదీ, కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దీపాదాస్ మున్షి సూచించారు.
KTR: వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 29 , 2024 | 07:12 PM