Delhi Liquor Scam: కవితకు మరో షాక్.. రౌస్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం..
ABN, Publish Date - May 29 , 2024 | 05:56 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోఎమ్మెల్సీ కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు ఉపశమనం కలగకపోవడంతో కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోఎమ్మెల్సీ కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు బెయిల్ (Bail) కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు ఉపశమనం కలగకపోవడంతో కవిత (Kavitha) తీహార్ జైలులోనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కవితపై దాఖలైన ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకోవటమే కాకుండా.. జూన్ 3వ తేదీన ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెటట్నున్నారు.
Phone Tapping: ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
ఈడీ వాదన ఇదే..
విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయంటూ న్యాయస్థానంలో ఈడీ చేసిన వాదనలను విన్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా.. తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు ఈడీ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్డు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు.
జూన్3న కోర్టుకు కవిత..
రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుని.. నిందితులుగా ఉన్న వారందరిని విచారణకు పిలవడంతో ఈకేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. కోర్టు ఆదేశాలతో కవితతో సహా నిందితులంతా కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. మరోవైపు జూన్4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.
Praneeth Rao: ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Updated Date - May 29 , 2024 | 05:56 PM