MLC Kavitha: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా
ABN, Publish Date - Sep 26 , 2024 | 04:44 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సీబీఐ జూన్ 7న సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. జూలై 22న ఆ చార్జిషీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు జరుగుతుండగా బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా చార్జిషీట్ పై విచారణ నిర్వహించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. అయితే.. చార్జిషీట్‌లో పేజీలు సరిగా లేవని, కొన్ని పేజీల్లో అక్షరాలు స్పష్టంగా లేవని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు న్యాయమూర్తికి తెలిపారు. మోహిత్ రావుతో ఏకీభవించిన న్యాయమూర్తి.. చార్జిషీట్ ను సరైన పద్ధతిలో ఫైల్ చేసి కాపీని అందజేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 4కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు
Updated Date - Sep 26 , 2024 | 04:44 AM